Mithali – PV Sindhu: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, ఇండియన్ నంబర్ వన్ ఏస్ షట్లర్ పీవీ సింధుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి పదివేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత మహిళగా కెప్టెన్ మిథాలీ రాజ్ నిలిచిన విషయం తెలిసిందే. ఇక స్విస్ ఓపెన్‌లో స్టా్ర్ షట్లర్ పీవీ సింధు రన్నరప్‌గా నిలిచింది. సరికొత్త రికార్డు సృష్టించిన ఈ ఇద్దరు మహిళా క్రీడాకారుల గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. వారిని పొగడ్తల వర్షంలో ముంచెత్తారు. మహిళా దినోత్సవాన్ని జరుపుకున్న సమయంలోనే మనదేశ మహిళా క్రీడాకారులు పతకాలు సాధించి సరికొత్త రికార్డు సృష్టించారని కొనియాడారు.
భారత మహిళల క్రికెట్‌లో మిథాలీ పాత్ర అద్భుతం అని ప్రధాని మోదీ అభినందించారు. ఆమె కృషి, విజయాల కథ స్త్రీ, పురుషులందరికీ ప్రేరణ ఇస్తుందన్నారు. ఇక పీవీ సింధు స్విస్ ఓపెన్‌లో రజత పతకం అందుకుందని ఆమెను అభినందించారు ప్రధాని మోదీ. ఇదే సమయంలో ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో బంగారు పతకాలు సాధించిన షూటర్లను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ప్రపంచకప్‌లో పురుషులు, మహిళా షూటర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారంటూ కొనియాడారు.
Also read: