Paralympics 2024: అవని రోడ్డు ప్రమాదంలో కాళ్లు కోల్పోయింది.. ఇప్పుడు పారాలింపిక్స్‌లో స్వర్ణం గెల్చుకుంది..

|

Aug 30, 2024 | 8:06 PM

అవని లేఖరాకు ఈ పతకం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆమె పారాలింపిక్ రికార్డుతో ఈ పతకాన్ని గెలుచుకుంది. 22 ఏళ్ల అవని ఫైనల్‌లో 249.7 పాయింట్లు సాధించి పారాలింపిక్‌లో రికార్డు సృష్టించింది. దీంతో పాటు తన టైటిల్‌ను కూడా కాపాడుకుంది. అదే సమయంలో ఈ ఈవెంట్‌లో దక్షిణ కొరియాకు చెందిన లీ యున్రీ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. కాగా భారత్ కు చెందిన మరో క్రీడాకారిణి మోనా 228.7 పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని అందుకుంది.

Paralympics 2024:  అవని రోడ్డు ప్రమాదంలో కాళ్లు కోల్పోయింది.. ఇప్పుడు పారాలింపిక్స్‌లో స్వర్ణం గెల్చుకుంది..
Avani Lekhara Won Gold Medal
Follow us on

పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. భారత్‌కు చెందిన ఇద్దరు అమ్మాయిలు ఒకే ఈవెంట్‌లో రెండు పతకాలు సాధించారు. షూటర్ అవనీ లేఖరా మరోసారి భారత్‌కు బంగారు పతకాన్ని అందించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్ 1లో అవనీ బంగారు పతకం సాధించింది. దీనికి ముందు అవని లేఖరా 2020 పారాలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ ఈవెంట్ SH-1లో బంగారు పతకాన్ని కూడా గెలుచుకుంది. కాగా మోనా అగర్వాల్ ఇదే ఈవెంట్ లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

పారాలింపిక్ రికార్డుతో బంగారు పతకం సాధించింది

అవని లేఖరాకు ఈ పతకం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆమె పారాలింపిక్ రికార్డుతో ఈ పతకాన్ని గెలుచుకుంది. 22 ఏళ్ల అవని ఫైనల్‌లో 249.7 పాయింట్లు సాధించి పారాలింపిక్‌లో రికార్డు సృష్టించింది. దీంతో పాటు తన టైటిల్‌ను కూడా కాపాడుకుంది. అదే సమయంలో ఈ ఈవెంట్‌లో దక్షిణ కొరియాకు చెందిన లీ యున్రీ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. కాగా భారత్ కు చెందిన మరో క్రీడాకారిణి మోనా 228.7 పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని అందుకుంది.

ఇవి కూడా చదవండి

ఇప్పటి వరకు భారత్ ఖాతాలో మూడు పతకాలు

పారిస్ పారాలింపిక్స్‌లో అవనీ లేఖరా అద్భుతమైన ప్రదర్శన చేసింది. గత పారాలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ ఈవెంట్ ఎస్‌హెచ్-1లో స్వర్ణ పతకంతో పాటు 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్‌లో కాంస్య పతకాన్ని అందుకుంది. అంటే లాస్ట్ టైం జరిగిన పారాలింపిక్స్‌లో అవనీ మొత్తం రెండు పతకాలు సాధించింది. ఈ ఈసారి కూడా తన ప్రదర్శనను కొనసాగించి 2024 పారాలింపిక్స్‌లో భారతదేశానికి మొదటి బంగారు పతకాన్ని అందించిన ఘనతను సొంతం చేసుకుంది. పారాలింపిక్ అవార్డ్స్ 2021లో అవనీకి ఉత్తమ మహిళా అరంగేట్రం క్రీడాకారిణిగా టైటిల్‌తో సత్కరించబడింది.

అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ

ఈ చారిత్రాత్మక ప్రదర్శనపై ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా ద్వారా అవని లేఖరాకు అభినందనలు తెలిపారు. పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత్ పతకాల ఖాతాను తెరిచింది! R2 మహిళల 10M ,​​ఎయిర్ రైఫిల్ SH1 ఈవెంట్‌లో స్వర్ణం గెలిచినందుకు అవని లేఖరాకు అభినందనలు చెప్పారు. 3 పారాలింపిక్ పతకాలను సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా కూడా ఆమె చరిత్ర సృష్టించింది. అవనీ అంకితభావం చూసి భారతదేశం గర్వవపడుతుందని పేర్కొన్నారు.

11 ఏళ్ల వయసులో పక్షవాతం వచ్చింది

అవని రాజస్థాన్‌లోని జైపూర్ నివాసి. పారాలింపిక్స్‌కు ఆమె ప్రయాణం అంత సులభంగా జరగలేదు. 2012లో కారు ప్రమాదంలో వెన్నెముకకు తీవ్ర గాయమైంది. దీంతో పక్షవాతానికి గురైంది. అప్పటికి అవని వయసు కేవలం 11 సంవత్సరాలు. అయితే దీని తర్వాత అవని తన పట్టు వదలలేదు. షూటింగ్‌ని తన కెరీర్‌గా చేసుకుంది. దీని తర్వాత ఆమె 2015లో తొలిసారిగా నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంది. తర్వాత మళ్ళీ కెరీర్ లో వెనుదిరిగి చూడలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .