World Sailing Championships 2021: ఇటలీ పోటీలకు హైదరాబాద్‌ బాలుడు.. అంతర్జాతీయ ఘనత సాధించిన 15 ఏళ్ల నావికుడు!

|

Jul 06, 2021 | 7:02 PM

ఇటలీలో జరిగే అప్టిమిస్ట్ ప్రపంచ సెయిలింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు హైదరాబాద్ కు చెందిన 15 ఏళ్ల సెయిలర్ ఎంపికయ్యాడు.

World Sailing Championships 2021: ఇటలీ పోటీలకు  హైదరాబాద్‌ బాలుడు.. అంతర్జాతీయ ఘనత సాధించిన 15 ఏళ్ల నావికుడు!
World Sailing Championships 2021 Vishwanath
Follow us on

World Sailing Championships 2021: ఇటలీలో జరిగే అప్టిమిస్ట్ ప్రపంచ సెయిలింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు హైదరాబాద్ కు చెందిన 15 ఏళ్ల సెయిలర్ ఎంపికయ్యాడు. ఈమేరకు ఈ యువ నావికుడు అంతర్జాతీయ ఘనత సాధించిన వాడిగా చరిత్ర సృష్టించాడు. హైదరాబాద్ కు చెందిన పాడిదళ విశ్వనాథ్.. ఇటలీ పోటీలకు ఎంపికయ్యాడు. గోవాలోని ఐఎన్ఎస్ మాండోవిలోని నేవీ బాయ్స్ స్పాట్స్ కంపెనీలో విశ్వనాథ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఇటలీలోని రివా డెల్ గార్డాలో జరిగే అప్టిమిస్ట్ ప్రపంచ సెయిలింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్‌ తరపున బరిలోకి దిగే జూనియర్ బాయ్స్‌ యాచింగ్ జట్టులో ఇతను సభ్యుడిగా ఉన్నాడు. ఈ పోటీలు జూన్‌ 30న ప్రారంభం కానున్నాయి. జులై 10న ఈ పోటీలు ముగుస్తాయి. సూర్యపేటకు చెందిన నిరుపేద కుటుంబం నుంచి విశ్వనాథ్ వచ్చాడు. ఇతని తల్లిదండ్రులు భవన నిర్మాణ రంగంలో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో 21 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చి స్థిరపడ్డారు. 2017లో సబ్ జూనియర్ అంతర్జాతీయ రెగట్టాలో విశ్వనాథ్ రజత పతకం గెలుచుకున్నాడు. అతని ప్రతిభ గుర్తించిన నేవీ బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ విశ్వనాథ్‌ను తన 12వ సంవత్సరంలో ఎంపిక చేసుకుంది. అప్పటి నుంచి ఆప్టిమిస్ట్ తరగతిలో నేషనల్ టీంలో పాల్గొంటున్నాడు.

ఏసియన్‌ ఛాంపియన్‌షిప్‌ తోపాటు ఒలంపిక్స్‌లో దేశానికి మెడల్స్ సాధించడమే లక్ష్యమని విశ్వనాథ్‌ పేర్కొంటున్నాడు. ప్రొఫెషనల్ నావికుడు కావడమే తన కల అని, ఇది అతి త్వరలోనే నెరవేరబోతోందని తెలిపాడు. ఈమేరకు నేవీ బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. తనలో ఉన్న టాలెంట్ ను గుర్తించి, ప్రోత్సహించిందని పేర్కొన్నాడు.

Also Read:

Tokyo Olympics 2020: దేశ ప్రజలంతా మీ వెంటే.. మమ్మల్ని గర్వపడేలా చేయండి..! అథ్లెట్లలో స్ఫూర్తినింపిన మాస్టర్ బ్లాస్టర్

Wimbledon 2021: ఓపెన్ ఎరాలో తొలి వ్యక్తిగా స్విట్జర్లాండ్ దిగ్గజం.. 39 ఏళ్ల వయసులో అరుదైన రికార్డు..!

On This Day in Cricket: మూడు గంటలపాటు క్రీజులో.. కేవలం 37 పరుగులు! విమర్శలు మాత్రం లేవు.. ఓన్లీ పొగడ్తలే.. ఎందుకో తెలుసా?