Women’s IPL: మార్చి 3 నుంచే మహిళల ఐపీఎల్ తొలి ఎడిషన్.. మీడియా హక్కుల కోసం టెండర్ జారీ..

BCCI: మహిళల ఐపీఎల్ మార్చి 3 నుంచి ప్రారంభం కానుంది. చివరి మ్యాచ్ మార్చి 26న జరుగుతుంది. మహిళల ఐపీఎల్‌ తొలి ఎడిషన్‌ ఇదే కావడం విశేషం.

Womens IPL: మార్చి 3 నుంచే మహిళల ఐపీఎల్ తొలి ఎడిషన్.. మీడియా హక్కుల కోసం టెండర్ జారీ..
Womens Ipl 2023

Updated on: Dec 10, 2022 | 9:55 AM

ఐపీఎల్ 2023 మొదటి మ్యాచ్ ఏప్రిల్ 1 నుంచి మొదలుకానుంది. కానీ, అంతకంటే ముందు మహిళల IPL మొదటి ఎడిషన్ జరగనుంది. మార్చి 3 నుంచి మహిళల ఐపీఎల్ ప్రారంభం కావచ్చని, చివరి మ్యాచ్ మార్చి 26న జరుగుతుందని భావిస్తున్నారు. మహిళల ఐపీఎల్‌ తొలి ఎడిషన్‌ ఇదే కావడం విశేషం. అదే సమయంలో మహిళల IPL తర్వాత IPL 2023 నిర్వహించనున్నారు. అయితే తేదీలను బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు. దీనికి ముందు మహిళల టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 2న కేప్‌టౌన్‌లో జరగనుంది.

మీడియా హక్కుల కోసం టెండర్ జారీ..

అదే సమయంలో శుక్రవారం నాడు బీసీసీఐ మహిళల ఐపీఎల్ మీడియా హక్కుల కోసం టెండర్‌ను జారీ చేసింది. 2023 నుంచి 2027 వరకు మహిళల ఐపీఎల్‌కు ఈ టెండర్ వర్తించనుంది. బీసీసీఐ జారీ చేసిన టెండర్‌లో చివరి తేదీ 31 డిసెంబర్ 2022గా పేర్కొన్నారు. అయితే, మీడియా హక్కుల కోసం వేలం ప్రక్రియ జనవరి 8 నుంచి ప్రారంభంకానుంది. ఇది కాకుండా బీసీసీఐ టెలివిజన్, మీడియా హక్కుల కోసం డిజిటల్ హక్కుల కోసం ప్రత్యేక కేటగిరీని ఉంచింది. ప్రస్తుతం బీసీసీఐ వేలానికి బేస్ ధరను ఇంకా నిర్ణయించలేదు.

ప్రతి జట్టులో గరిష్టంగా పద్దెనిమిది మంది..

బీసీసీఐ ప్రకారం, దేశీయ, అంతర్జాతీయ ఆటగాళ్లతో మంచి జట్టును తయారు చేయడానికి ఈ టోర్నమెంట్‌లో మొదట ఐదు జట్లు ఆడనున్నాయి. ప్రతి జట్టు గరిష్టంగా పద్దెనిమిది మంది ఆటగాళ్లను కలిగి ఉంటుంది. ఈ 18 మంది ఆటగాళ్లలో ఆరుగురికి మించి విదేశీ ఆటగాళ్లు ఉండరు. విశేషమేమిటంటే, మహిళల బిగ్ బాష్ లీగ్ 2016 సంవత్సరం నుంచి ఆస్ట్రేలియాలో నిర్వహిస్తున్నారు. ఇది కాకుండా, గత సంవత్సరం ఇంగ్లాండ్‌లో మహిళల ది హండ్రెడ్ లీగ్‌ను నిర్వహించారు. వచ్చే ఏడాది నుంచి మహిళల లీగ్‌ను నిర్వహించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..