Winter Olympic: ఇది సిగ్గుచేటు.. టార్బ్ బేరర్‌గా గాల్వాన్‌లో మరణహోమానికి పాల్పడిన జవానా..! విమర్శలు గుప్పించిన యూఎస్

|

Feb 03, 2022 | 2:12 PM

China: వింటర్ ఒలింపిక్స్‌లో డ్రాగన్ గేమ్స్ మొదలుపెట్టింది. గాల్వాన్‌లో భారత సైనికుల చేతిలో గాయపడిన చైనా సైనికుడిని టార్చ్ బేరర్‌గా నియమించడంపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసింది.

Winter Olympic: ఇది సిగ్గుచేటు.. టార్బ్ బేరర్‌గా గాల్వాన్‌లో మరణహోమానికి పాల్పడిన జవానా..! విమర్శలు గుప్పించిన యూఎస్
Winter Olympic 2022 Torchbearer Issue
Follow us on

Winter Olympic 2022: వింటర్ ఒలింపిక్స్ 2022 సాకుతో చైనా(China) రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఫిబ్రవరి 4 నుంచి 20 వరకు బీజింగ్‌లో ఈ క్రీడలు జరగనున్నాయి. బుధవారం, క్రీడల టార్చ్ రిలే లేదా టార్చ్ ర్యాలీని చేపట్టారు. అందులో అథ్లెట్లతో పాటు ఓ సైనికుడు కూడా ఉన్నాడు. అతని పేరు ‘కి ఫాబావో’. అయితే ఇక్కడే అసలు వివాదం మొదలైంది. 2020లో లడఖ్‌లోని గాల్వాన్ లోయలో(India Galwan Valley Dispute) భారత్, చైనా మధ్య జరిగిన హింసాత్మక సైనిక వాగ్వివాదంలో ఇతను పాల్గొన్నాడు. దీంతో అన్ని దేశాల నుంచి విమర్శలు వస్తున్నాయి. చైనా చర్యపై అమెరికా(US) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ యుద్ధంలో పాల్గొన్న సమయంలో ఫాబావో తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ప్రస్తుతం అతను సురక్షితంగా ఉన్నాడు.

2020 మే 5న గాల్వాన్ వివాదంలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. గాల్వన్ వ్యాలీలో 40 మంది చైనా సైనికులు మరణించారని అమెరికాతో పాటు ప్రపంచంలోని పలు మీడియా సంస్థలు తెలిపాయి. అయితే, చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) తో కలిసి Xi Jinping ప్రభుత్వం మాత్రం కచ్చితమైన వివరాలు మాత్రం ప్రకటించలేదు. 2022 వింటర్ ఒలింపిక్స్‌ను దౌత్యపరమైన బహిష్కరణ చేయడం ద్వారా అమెరికాతో సహా అనేక దేశాలు చైనాకు మానవ హక్కులపై బలమైన సందేశాన్ని ఇచ్చాయని ఇక్కడ తెలుసుకోవడం కూడా ముఖ్యం.

15 జూన్ 2020 రాత్రి గాల్వాన్ లోయలో జరిగిన వాగ్వివాదం సమయంలో, దాదాపు 300 మంది చైనా సైనికులు పాల్గొన్నారు. వారిని ఎదుర్కొనేందుకు బరిలోకి దిగిన భారత సైనికుల సంఖ్య కేవలం 45 నుంచి 50 లోపే ఉంది. జ్యోతి 4వ తేదీన క్రీడా గ్రామానికి చేరుకుంటుందని చైనా అధికారిక వార్తాపత్రిక ‘ది గ్లోబల్ టైమ్స్’ బుధవారం నాడు ప్రకటించింది. ఇందులో సామాన్యులు, క్రీడాకారులు టార్చ్‌లతో పరుగులు తీస్తున్నారు. వీరిలోకి ఫాబావో అనే PLA సైనికుడు కూడా చేరాడు. భారత సైనికులతో జరిగిన ఘర్షణలో ఫాబావో తీవ్రంగా గాయపడి గాల్వాన్ నుంచి విమానంలో వెనక్కు పంపినట్లు వార్తలు వెలువడ్డాయి. నాలుగుసార్లు షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్ వెంగ్ మెంగ్ టార్చ్‌ను ఫాబావోకు అందించాడు. ఫిబ్రవరి 4న ఒలింపిక్ పార్క్‌కు చేరుకోవడానికి ముందు జ్యోతి మూడు హోస్ట్ జోన్‌ల గుండా వెళుతుంది. బీజింగ్‌తో పాటు యాంగ్‌కింగ్‌, జాంగ్‌జికావోలకు తీసుకెళ్లనున్నారు.

ఇప్పటికీ తప్పుడు నివేదికలే..
గాల్వన్ వ్యాలీలో మరణించిన తమ సైనికుల సంఖ్యను చైనా ఎప్పుడూ ప్రకటించలేదు. ఈ ఘర్షణలో 40 మందికి పైగా చైనా సైనికులు మరణించారని అమెరికా ఇంటెలిజెన్స్ తొలిసారిగా వెల్లడించింది. ఈ నివేదికలు ప్రచురించినప్పుడు, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఒక ప్రకటనలో తాము కూడా నష్టపోయామని అంగీకరించింది. అయినప్పటికీ, నష్టానికి సంబంధించిన అర్థం ఏమిటో ఇప్పటికీ స్పష్టంగా ప్రకటించలేదు.
లడఖ్‌లో ఇరు దేశాల మధ్య ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది. 14 రౌండ్ల చర్చల తర్వాత కూడా కొన్ని ముఖ్యమైన అంశాలపై ఇరు దేశాల సైనికులు ముఖాముఖిగా ఉన్నారు.

అయితే ఒక చైనీస్ ట్రావెల్ బ్లాగర్ Li Qijian గాల్వాన్‌పై చైనా వెల్లడించిన అబద్ధాలను బయటపెట్టాడు. చైనాలోని కాంగ్‌వాక్సీలో భారత సైనికుల చేతిలో మరణించిన సైనికుల సమాధులను సందర్శించి కిజియాన్ ఓ వీడియో రూపొందించారు. అమరవీరులను అవమానించినందుకు పిషాన్ కౌంటీలోని కోర్టు క్విజియాన్‌ను దోషిగా నిర్ధారించింది. అతనికి 7 నెలల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం అతను జైలులో ఉన్నాడు.

గేమ్‌లోని ఆటగాళ్లకు బెదిరింపులు..
యూఎస్, అనేక పాశ్చాత్య దేశాలు గేమ్‌లను దౌత్యపరమైన బహిష్కరణ చేశాయి. 6 వారాల క్రితమే తమ నిర్ణయాన్ని ప్రకటించారు. దీని తరువాత, చైనాతోపాటు ఇతర దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగింది. చైనా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని దౌత్య బహిష్కరణ దేశాలు ఆరోపించాయి. దీనికి సంబంధించిన వేలకొద్దీ రుజువులు ప్రపంచానికి అందుబాటులో ఉన్నాయి.

గత నెలలో చైనా కూడా క్రీడల్లో పాల్గొనే అథ్లెట్లను బెదిరించడంతో ఈ వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. వింటర్ ఒలింపిక్స్‌కు వచ్చే క్రీడాకారులు రాజకీయాలకు దూరంగా ఉండాలని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. ఆటలను క్రీడల వలె పరిగణించాలని, ఎవరైనా అథ్లెట్ చైనా చట్టాలు, నిబంధనలను విస్మరిస్తే, అతను శిక్షను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ పేర్కొంది.

Also Read: IND vs WI: టీమిండియాకు మరోదెబ్బ.. తొలి వన్డేకు దూరమైన కీలక ప్లేయర్.. కారణం ఏంటంటే?

Winter Olympics: వింటర్ ఒలింపిక్స్‌లో కరోనా కలకలం.. ప్రారంభానికి ఒకరోజు ముందు భారీగా కేసులు నమోదు..!