Deaflympics 2021: మే 1 నుంచి డెఫ్లింపిక్స్ 2021.. భారత అథ్లెట్ల బృందానికి ఘనంగా సెండాఫ్ ఇచ్చిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్..

|

Apr 25, 2022 | 10:25 PM

Deaflympics 2021: బ్రెజిల్‌లోని కాక్సియాస్‌ డుసుల్‌ లో జరిగే డెఫ్లింపిక్స్‌ 2021 గేమ్స్‌లో భారత్ నుంచి 65 మంది అథ్లెట్స్ పాల్గొనున్నారు. మే 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న..

Deaflympics 2021: మే 1 నుంచి డెఫ్లింపిక్స్ 2021.. భారత అథ్లెట్ల బృందానికి ఘనంగా సెండాఫ్ ఇచ్చిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్..
Deaflympics
Follow us on

Deaflympics 2021: బ్రెజిల్‌లోని కాక్సియాస్‌ డుసుల్‌ లో జరిగే డెఫ్లింపిక్స్‌ 2021 గేమ్స్‌లో భారత్ నుంచి 65 మంది అథ్లెట్స్ పాల్గొనున్నారు. మే 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ గేమ్స్‌లో పాల్గొనేందుకు ఇవాళ వీరంతా బ్రెజిల్ బయలుదేరారు. కాగా, భారత అథ్లెట్ల బృందానికి ప్రభుత్వ ఘనంగా సెండాఫ్ ఇచ్చింది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, సహాయ మంత్రి నిశిత్ ప్రమాణిక్, ఇతర ప్రముఖులు ఈ సెండాఫ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాగా, బ్రెజిల్‌లోని కాక్సియాస్ డు సుల్‌లో జరిగే గేమ్స్‌లో మొత్తం 65 మంది భారత అథ్లెట్లు పాల్గొంటారు. వీరంతా మొత్తం 11 క్రీడా విభాగాల్లో పాల్గొంటారు. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, జూడో, గోల్ఫ్, కరాటే, షూటింగ్, స్విమ్మింగ్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, టైక్వాండో, రెజ్లింగ్ విభాగాల్లో పథకాల కోసం తలపడనున్నారు. ఈ గేమ్స్ మే 1వ తేదీ నుంచి మే15వ తేదీ వరకు జరుగాయి.

ఈ నేపథ్యంలో అథ్లెట్ల బృందానికి ఆల్‌ ది బెస్ట్ చెబుతూ సెండాఫ్ కార్యక్రమాన్ని నిర్వహించింది ప్రభుత్వం. అథ్లెట్ల బృందానికి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. “దేశంలోని ప్రతి ఒక్కరి తరపున, నేను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఈ గేమ్స్‌కు ఎంపికవడం ద్వారా మీ సత్తాను చాటారని చెప్పొచ్చు. ఈ క్రీడల్లో భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అతిపెద్ద బ్యాచ్ ఇదే, బ్రెజిల్ నుంచి అత్యధిక పతకాలను అందుకుంటామని విశ్వసిస్తున్నాను. ఒలింపిక్స్, పారాలింపిక్స్, డెఫ్లింపిక్స్‌లో భారతదేశం అతిపెద్ద క్రీడా శక్తిగా మారుతుంది.ఈ శతాబ్దం మాది. మేము అన్ని క్రీడా రంగాల్లో భారతదేశ పతాకాన్ని ఎగురవేస్తూనే ఉంటాం.’’ అని అనురాగ్ ఠాకూర్ వారిని మోటివేట్ చేశారు.

ఆల్ ఇండియా స్పోర్ట్స్ కౌన్సిల్ ఫర్ ది డెఫ్ (AISCD), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI) అథ్లెట్లకు అందించిన అపారమైన మద్దతు గురించి కూడా కేంద్ర మంత్రి మాట్లాడారు. “AISCD, SAI రెండూ అథ్లెట్లకు చాలా మద్దతునిచ్చాయి. డెఫ్లింపిక్స్-బౌండ్ అథ్లెట్ల కోసం SAI కేంద్రాలలో 30-రోజులు జాతీయ కోచింగ్ క్యాంప్ సదుపాయం కల్పించడం జరిగింది. అంతే కాకుండా, అథ్లెట్లకు కిట్‌లు, డెఫ్లింపిక్స్‌కు సెరిమోనియల్ డ్రెస్‌లు ఇవ్వడంతో పాటు వారి వసతి, బస, బోర్డింగ్, రవాణా ఏర్పాట్లు వంటి ప్రతీది SAI ఏర్పాటు చేసింది.’’ అని చెప్పుకొచ్చారు.

ఇక కేంద్ర సహాయ మంత్రి నిశిత్ ప్రమాణిక్ మాట్లాడుతూ.. ‘‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆలోచనల మేరకు దేశంలో క్రీడారంగం అభివృద్ధి చెందుతుంది. ‘చీర్ ఫర్ ఇండియా’ గేమ్ ఛేంజర్‌గా నిలిస్తోంది. ఒలింపిక్స్, పారాలింపిక్స్, డెఫ్లింపిక్స్.. గేమ్స్ ఏదైనా భారతదేశం క్రీడాకారులు స్ఫూర్తిని నింపుతున్నారు. ఈసారి డెఫ్లింపిక్స్‌లో అతిపెద్ద బృందం పాల్గొంటుంది. ఇప్పటికే యంగ్ ఇండియాకు గొప్ప ప్రేరణగా నిలిచారు. బ్రేజిల్ నుంచి ఎక్కువ పథకాలను సాధిస్తారనే విశ్వాసం మాకుంది.’’ అని పేర్కొన్నారు.

కాగా, 2017లో టర్కీలో జరిగిన చివరి డెఫ్లింపిక్స్‌లో 1 స్వర్ణం, 1 రజతం, 3 కాంస్య పతకాలతో సహా మొత్తం 5 పతకాలను కైవసం చేసుకుంది భారత అథ్లెట్ల బృందం.

Also read:

Big News Big Debate: హస్తంతో డీల్‌ – గులాబీతో ములాఖత్.. కేసీఆర్‌కు పీకే చెప్పిన ముచ్చటేంటి?..

KTPP fire accident: కేటీపీపీలో అగ్నిప్రమాదం.. ముగ్గురి పరిస్థితి విషమం..

Post Office scheme: అదరిపోయే స్కీమ్.. రూ. 50 వేలు డిపాజిట్ చేసి రూ. 3,300 ఆదాయం పొందొచ్చు.. అదెలాగంటే..