Indian Hockey Team Return: కోవిడ్ తర్వాత తొలి విజయం.. జర్మనీ జట్టును చిత్తుగా ఓడించిన భారత్..

|

Mar 01, 2021 | 3:02 PM

Indian Hockey Team: కరోనా కారణంగా ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న భారత హాకీ జట్టు.. ఈ ఏడాది తొలి మ్యాచ్‌లోనే తన సత్తా చూపించింది. యూరప్ పర్యటనలో ఉన్న భారత జట్టు జర్మనీలో జరిగిన నాలుగు..

Indian Hockey Team Return: కోవిడ్ తర్వాత తొలి విజయం.. జర్మనీ జట్టును చిత్తుగా ఓడించిన భారత్..
Indian hockey team return
Follow us on

Indian Hockey Team Win: కరోనా కారణంగా ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న భారత హాకీ జట్టు.. ఈ ఏడాది తొలి మ్యాచ్‌లోనే తన సత్తా చూపించింది. యూరప్ పర్యటనలో ఉన్న భారత జట్టు జర్మనీలో జరిగిన నాలుగు మ్యాచ్​ల టోర్నీలో తొలి మ్యాచ్‌లో లోకల్ జట్టుపై 6-1 గోల్స్​ తేడాతో విజయాన్ని అందుకుంది. భారత ఆటగాళ్లపై ఎలాంటి ప్రభావం చూపించలేక పోయారు. అద్భుతమైన ఆటతీరుతో జర్మనీ జట్టుకు చుక్కలు చూపించారు. గోల్​కీపర్​ పీఆర్​ శ్రేజేష్​ జట్టుకు నేతృత్వం దూకుడు ప్రదర్శిస్తోంది.

దాదాపు 12 నెలల తర్వాత ఆడుతున్న భారత జట్టు ప్రత్యర్థి టీమ్​కు ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. గెలవాలన్న కసి వారి ఆటలో స్పష్టంగా కనిపించింది. భారత జట్టు తరఫున నీలకంఠ శర్మ, వివేక్​ సాగర్​ ప్రసాద్, లలిత్​ కుమార్ ఉపాధ్యాయ, ఆకాశ్​ దీప్ సింగ్, హర్మన్​ప్రీత్ సింగ్ లు గోల్స్​ చేశారు.

ఇరు జట్లలో తొలి గోల్‌ను భారత్​ తరఫున పెనాల్టీ కార్నర్​ ద్వారా సాధించాయి. 14వ నిమిషంలో జర్మనీ మొదటి గోల్ చేసింది. దీంతో స్కోరు 1-1తో సమమైంది. తర్వాత వివేక్​ సాగర్​ వరుసగా రెండు గోల్స్​ సాధించడంతో భారత్ 3-1 ఆధిక్యంలోకి దూసుకుపోయింది. ఆ తర్వాత ఆతిథ్య జట్టును ఎక్కడా కోలుకోనివ్వలేదు.

తదుపరి మ్యాచ్​ మార్చి 2న జర్మనీతోనే జరగనుంది. మార్చి 6,8 తేదీల్లో గ్రేట్​ బ్రిటన్​తో ఆడనుంది టీమ్​ఇండియా.

ఇవి కూడా చదవండి

Smriti Irani: స్ట్రీట్ ఫుడ్‌పై కేంద్ర మంత్రి మోజు.. రోడ్డుపై పానీపూరీ తింటూ కనిపించిన స్మృతి ఇరానీ..
Gold Price Today: భారీగా తగ్గిన పసిడి ధరలు.. ఈరోజు తులం గోల్డ్‌ ఎక్కడ, ఎంత ఉందంటే..