Telangana: వరంగల్ ముద్దుబిడ్డపై కాసుల వర్షం.. రూ. కోటితోపాటు గ్రూప్ 2 ఉద్యోగం.. దీప్తికి సీఎం రేవంత్ భారీ నజరానా..

| Edited By: Venkata Chari

Sep 08, 2024 | 12:56 PM

Young Athlete Deepthi Jeevanji: పారిస్ పారాలింపిక్స్‌లో భారతీయులు తమ సత్తాను చాటుకున్నారు. పారాలింపిక్స్‌లో మెడల్స్‌ సాధించి, భారతీయులను గర్వపడేలాగా చేస్తున్నారు. అందులో మన తెలంగాణకు చెందిన యువ అథ్లెట్ దీప్తి జీవాంజి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. అయితే, మహిళల 400 మీటర్ల టి20 క్లాసులో దీప్తి కాంస్య పథకం గెలుచుకుంది.

Telangana: వరంగల్ ముద్దుబిడ్డపై కాసుల వర్షం.. రూ. కోటితోపాటు గ్రూప్ 2 ఉద్యోగం.. దీప్తికి సీఎం రేవంత్ భారీ నజరానా..
Cm Revanth Reddy Deepthi Je
Follow us on

Young Athlete Deepthi Jeevanji: పారిస్ పారాలింపిక్స్‌లో భారతీయులు తమ సత్తాను చాటుకున్నారు. పారాలింపిక్స్‌లో మెడల్స్‌ సాధించి, భారతీయులను గర్వపడేలాగా చేస్తున్నారు. అందులో మన తెలంగాణకు చెందిన యువ అథ్లెట్ దీప్తి జీవాంజి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. అయితే, మహిళల 400 మీటర్ల టి20 క్లాసులో దీప్తి కాంస్య పథకం గెలుచుకుంది. పారాలింపిక్స్ అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారత్‌కు తొలి పథకం అందించిన క్రీడాకారిణిగా వరంగల్ కు చెందిన దీప్తి చరిత్రను సృష్టించింది.

భారత జెండాను రెపరెపలాడించిన దీప్తిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాదు ఆమెకు భారీ నజరాన కూడా ప్రకటించారు. పారాలింపిక్స్‌లో సత్తా చాటినందుకుగాను దీప్తికి కోటి రూపాయల నగదుతో పాటు గ్రూప్-2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేకాదు ఆమె కోచ్‌కు 10 లక్షల రూపాయల నజరానాను కూడా ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

పారాలింపిక్స్ క్రీడాకారులకు శిక్షణ ప్రోత్సాహానికి ఏర్పాట్లు చేయాలని కూడా సీఎం ఆదేశించినట్లుగా తెలుస్తోంది. దీప్తికి భారీ నజరానా ప్రకటించడంతో సీఎంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణకు తొలిసారిగా పతాకాన్ని అందించిన దీప్తి స్వస్థలం వరంగల్ జిల్లా కల్లెడ గ్రామం. భవిష్యత్తులో కూడా తాను ఎన్నో పథకాలను అధిరోహించి దేశ, రాష్ట్ర గౌరవాన్ని కాపాడతానని దీప్తి ఈ సందర్భంగా పేర్కొంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..