Sagar Rana murder: ఆ రోజు ఏం జరిగిదంటే..! పోలీసుల ముందు అప్రూవర్‌గా మారిన సుశీల్‌ ప్రాణ మిత్రుడు..!

యువరెజ్లర్‌ సాగర్ రాణా హత్యకేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. తాజాగా సుశీల్‌ కుమార్‌ ప్రాణమిత్రుడు ప్రిన్స్‌ అప్రూవర్‌గా మారేందుకు అంగీకరించాడని తెలిసింది. ఛత్రసాల్‌ స్టేడియంలో

Sagar Rana murder: ఆ రోజు ఏం జరిగిదంటే..! పోలీసుల ముందు అప్రూవర్‌గా మారిన సుశీల్‌ ప్రాణ మిత్రుడు..!
Sushil Kumar

Updated on: May 30, 2021 | 6:26 AM

యువరెజ్లర్‌ సాగర్ రాణా హత్యకేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. తాజాగా సుశీల్‌ కుమార్‌ ప్రాణమిత్రుడు ప్రిన్స్‌ అప్రూవర్‌గా మారేందుకు అంగీకరించాడని సమాచారం. ఛత్రసాల్‌ స్టేడియంలో దాడి జరిగినప్పుడు అతడే ఘటనను వీడియో తీసిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో తొమ్మిదో అరెస్టు నమోదైంది. బిందర్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాగర్‌ను అతడు కూడా గాయపరచన వారిలో ఉన్నాడు. మొత్తంగా ఈ కేసులో 12 మందిపై అభియోగాలు నమోదు కాగా ప్రవీణ్‌, ప్రదీప్‌, వినోద్‌ ప్రధాన్‌ తప్పించుకొని తిరుగుతున్నారు. వారిని పట్టుకొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు .

ఛత్రసాల్‌ స్టేడియంలో మే 4న సాగర్‌ రాణాపై సుశీల్‌ కుమార్‌ బృందం దాడి చేసింది. తీవ్రంగా గాయపడ్డ సాగర్‌ రెండు రోజుల తర్వాత మరణించాడు. అప్పటి నుంచి సుశీల్‌ ఫ్రెండ్స్ అంతా  తప్పించుకొని తిరిగాడు. పోలీసులు ఎనిమిది బృందాలుగా విడిపోయి అతడి ఆచూకీ కనుగొన్నారు.

గత ఆదివారం అరెస్టు చేసి కోర్టుకు తరలించగా అతడికి న్యాయస్థానం ఆరు రోజుల రిమాండ్‌ విధించగా.. తాజాగా మరో నాలుగు రోజుల కస్టడీని పొడిగించింది. విచారణలో భాగంగా సుశీల్‌ కుమార్‌తోపాటు, అతడి సహచరుడు అజయ్‌కి నాలుగు రోజుల కస్టడీని పొడిగిస్తూ శనివారం ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువడించింది.

Amazing Viral Video: గాలిలో ఎగురుతూన్న డేగపై చేప దాడి చేసింది… ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు…

యాజమానులు చేసిన పనికి షాక్ తిన్న కుక్కపిల్ల.. పాపం.. అక్కడే అలా.. నవ్వులు పూయిస్తున్న Viral Video

PM KISAN Yojana: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. పీఎం కిసాన్‌ పథకంలో చేరేందుకు చివరి తేదీ ఎప్పుడంటే..!

Yuvika Chaudhary: సినీ నటిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు… నిమ్నవర్గాలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిందని ఫిర్యాదు..

 

Follow Us