Roller Skating: అరుదైన రికార్డు దిశగా గుంటూరు యువ కిశోరం.. గంటలో 14 కిలోమీటర్లు పూర్తి చేసిన రోలర్ స్కేటర్..

స్కేటింగ్ లో గుంటూరు కి అరుదైన గౌరవం దక్కనుంది. పాత గుంటూరుకు చెందిన ఓ యువకుడు ఒక గంటలో 14 కిలోమీటర్ల మేర స్కేటింగ్ పూర్తి చేసి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు కోసం నమోదు చేసుకున్నాడు. గుంటూరులో..

Roller Skating: అరుదైన రికార్డు దిశగా గుంటూరు యువ కిశోరం.. గంటలో 14 కిలోమీటర్లు పూర్తి చేసిన రోలర్ స్కేటర్..
Scetings

Updated on: Jan 02, 2022 | 2:54 PM

స్కేటింగ్ లో గుంటూరు కి అరుదైన గౌరవం దక్కనుంది. పాత గుంటూరుకు చెందిన ఓ యువకుడు ఒక గంటలో 14 కిలోమీటర్ల మేర స్కేటింగ్ పూర్తి చేసి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు కోసం నమోదు చేసుకున్నాడు. గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో పాత గుంటూరుకు చెందిన పెండాల హనుమంత్ అజయ్ కుమార్ రోలర్ స్కేటింగ్ లో గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఒక గంటలో 14 కిలోమీటర్ల పాటు స్కేటింగ్ చేశాడు. తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ముఖ్య అతిథిగా హాజరై స్కేటింగ్ ను ప్రారంభించారు. యువత చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తి చూపడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్థఫా అన్నారు.

అదేవిధంగా బ్రహ్మానంద రెడ్డి స్టేడియం ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి అంతర్జాతీయ క్రీడలకు వేదికగా మారుస్తామని ఆయన వెల్లడించారు. ఒక గంటలో 14 కిలోమీటర్ల పాటు ఇప్పటి వరకు ఎవరు స్కేటింగ్ చేయలేదని అజయ్ కుమార్ తెలిపారు. గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ కోసం తాజాగా ఒక గంటలో 14 కిలోమీటర్ల పాటు స్కేటింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి: KTR: ఆదిలాబాద్‌లో సీసీఐను పున:ప్రారంభించండి.. కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ లేఖ

Mega Star Chiranjeevi: ‘అలాంటి పంచాయితీలు నేను చేయలేను’.. చిరు సంచలన వ్యాఖ్యలు

Loading...
Unable to load recommendations.
Follow Us