పారిస్ ఒలింపిక్స్ జావెలిన్ త్రో గోల్డ్ మెడల్ విన్నర్ అర్షద్ నదీంకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా ? టెర్రరిస్టులతో అతడు చేతులు కలిపాడా ? నిషేధిత లష్కర్ ఏ తాయిబా ఉగ్రవాద సంస్థ అగ్రనేత హరీస్ డార్‌తో నదీం ఉన్న వీడియో బయటకు వచ్చింది. లష్కర్ ఉగ్రవాద సంస్థ ఆర్ధిక వ్యవహాలను మొత్తం హరీస్ డార్ చక్కబెడుతున్నారు. భారత్‌తో పాటు ఐక్యరాజ్యసమితి కూడా అతడిని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ప్రకటించింది. అలాంటి హరీస్‌తో కలిసి నదీం సంబరాలు చేసుకోవడం సంచలనం రేపింది. అంతేకాదు నదీం శిక్షణకు లష్కర్ సంస్థ ఆర్ధికసాయం చేసినట్టు కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెల్చుకున్న నదీంకు పాకిస్తాన్‌లో ఘనస్వాగతం లభించింది.
పాకిస్తాన్ నేతలు , అభిమానులు నదీంకు ఎయిర్‌పోర్ట్ నుంచి ఘనస్వాగతం పలికారు. నగర వీధుల్లో భారీ కాన్వాయ్‌తో ఊరేగించారు. కోట్లాది రూపాయల బహుమతులతో పాటు ఖరీదైన వాహనాలు కూడా గిఫ్ట్‌గా వచ్చాయి. ఇదే సమయంలో అర్షద్ నదీంను లష్కర్ నేత హరీస్ కలవడం సంచలనం రేపింది.
🚨🚨🚨Big Expose:
The sinister connection between Pak sportsman Arshad Nadeem & UN designated terrorist organisations fin sec Harris Dhar (Lashkar-e-Taiba)
📍It’s evident from their conversation that this video is very recent after Arshad Nadeem’s return from the Paris Olympics… pic.twitter.com/ko8OlJ81ct
— OsintTV 📺 (@OsintTV) August 12, 2024
భారత ఆటగాడు నీరజ్ చోప్రాను ఓడించి గోల్డ్ సాధించాడు అర్షద్ నదీం.. ఆయన విజయం అందరూ హర్షించారు. భారత్‌లో కూడా అతడి ప్రతిభను మెచ్చుకున్నారు. కాని రక్తపాతం సృష్టించే ఉగ్రవాద నేతలతో కలిసి సంబరాల్లో పాల్గొనడంపై మాత్రం విమర్శలు వెలువెత్తాయి. పంజాబ్ లోని ఖానేవాల్ జిల్లా నదీం స్వస్థలం.. అయితే నదీను కలవడానికి లష్కర్ నేత రావడంపై వివాదం చెలరేగింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..