Neeraj Chopra: ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. గోల్డెన్ బాయ్‌కి వెండి దండ

|

Aug 09, 2024 | 7:12 AM

ఒలింపిక్స్‌లో నీరజ్‌ చోప్రా మరో చరిత్ర రాశాడు. టోక్యోలో బంగారు పతకాన్ని తీసుకొచ్చిన నీరజ్‌.. ఈసారి రజతాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అసలు భారత్‌లో ఊసే లేని జావెలిన్‌ త్రోలో పతకాన్ని తీసుకురావడమే గొప్ప అయితే..

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. గోల్డెన్ బాయ్‌కి వెండి దండ
Neeraj Chopra
Follow us on

ఒలింపిక్స్‌లో నీరజ్‌ చోప్రా మరో చరిత్ర రాశాడు. టోక్యోలో బంగారు పతకాన్ని తీసుకొచ్చిన నీరజ్‌.. ఈసారి రజతాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అసలు భారత్‌లో ఊసే లేని జావెలిన్‌ త్రోలో పతకాన్ని తీసుకురావడమే గొప్ప అయితే.. నీరజ్‌ దాన్ని రెండు సార్లు సాధించడం.. అనన్య సామాన్యం. జావెలిన్‌ త్రో ఫైనల్లో.. 89.45 మీటర్లు విసిరి రెండో స్ధానంలో నిలిచాడు చోప్రా. తొలి స్థానంలో 92.97 మీటర్లు విసిరిన పాక్‌ అథ్లెట్‌ నదీమ్‌.. ఒలింపిక్‌ రికార్డుతో బంగారం సాధించాడు. ఓ భారతీయ అథ్లెట్ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్‌లో వరుసగా రెండు పతకాలు సాధించడం ఇదే తొలిసారి.

ఇదిలా ఉంటే.. గురువారం ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలు వచ్చాయి. నీరజ్‌ సిల్వర్‌ సాధిస్తే.. హాకీ జట్టు బ్రాంజ్‌ మెడల్‌ మన ఖాతాలో వేసింది. స్పెయిన్‌తో జరిగిన బ్రాంజ్‌ మెడల్‌ మ్యాచ్‌లో విజయాన్ని నమోదు చేసింది భారత హాకీ జట్టు. స్పెయిన్‌పై 2-1 గోల్స్‌ తేడాతో నెగ్గింది. దీంతో భారత్‌ ఖాతాలో నాలుగో కాంస్య పతకం వచ్చి చేరింది. 47 ఏళ్ల తర్వాత వరుసగా 2 ఒలింపిక్స్‌లో పతకాలు సాధించింది హాకీ టీమ్‌. ఈ ఆటతో.. గోల్‌ కీపర్‌ శ్రీజేష్‌ ఆటకు వీడ్కోలు పలికాడు.

మరిన్ని ఒలింపిక్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..