స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకలకు హాజరైన మెగాపవర్‌స్టార్.. పోలీసుల కథలంటే ఇష్టమన్న రాంచరణ్

|

Feb 03, 2021 | 5:16 PM

సైబరాబాద్‌ పోలీస్ కమిషనరేట్‌ పరిధిలో సిబ్బందికి నాలుగు రోజులుగా గేమ్స్ కాంపిటీన్స్‌ జరిగాయి. ఫైనల్ ఈవెంట్‌కు చీప్ గెస్ట్‌గా హీరో రామ్‌చరణ్ హాజరయ్యారు. ఆయనకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఘనస్వాగతం పలికారు.

స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకలకు హాజరైన మెగాపవర్‌స్టార్.. పోలీసుల కథలంటే ఇష్టమన్న రాంచరణ్
Follow us on

సైబరాబాద్‌ పోలీస్ కమిషనరేట్‌ పరిధిలో సిబ్బందికి నాలుగు రోజులుగా గేమ్స్ కాంపిటీన్స్‌ జరిగాయి. ఫైనల్ ఈవెంట్‌కు చీప్ గెస్ట్‌గా హీరో రామ్‌చరణ్ హాజరయ్యారు. ఆయనకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఘనస్వాగతం పలికారు. రామ్‌చరణ్‌తోపాటు ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూరి రమేశ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

క్రీడాపోటీల్లో విజేతలకు రామ్‌చరణ్‌, రమేశ్‌ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రామ్‌చరణ్… తనకు పోలీస్ కథలు అంటే చాలా ఇష్టమని చెప్పారు. అందుకే ధ్రువ సినిమాలో ఐపీఎస్‌ పాత్ర కోసం చాలా కష్టపడి పని చేశా అన్నారు. ఏ చిన్న రిమార్క్‌ లేకుండా చూసుకున్నానని గుర్తు చేసుకున్నారు.

పోలీసు అధికారులు సినిమా చూసి తప్పులు ఎత్తి చూపే అవకాశం లేకుండా పని చేశానని గుర్తు చేశారు. ప్రస్తుతం చేస్తున్న ట్రిపుల్ ఆర్ మూవీలో మేకప్ వేసుకోవడానికి రెండు గంటలు తీయడానికి మరో రెండు గంటల సమయం పడుతుందని… సమయం లేకపోయినా పోలీసులంటే ఇష్టంతోనే ఈవెంట్‌కు వచ్చానని తెలిపారు.

కొవిడ్ టైంలో పోలీసులు అద్భుతంగా పని చేశారని అప్రిసియేట్ చేశారు. ఆటల్లో గెలుపుఓటములు సహజమని… అందులో పార్టిస్పేషన్ ముఖ్యమని అభిప్రాయపడ్డారు. క విజేతలుగా నిలిచిన వారికి అభినందనలు తెలిపారు. రాంచరణ్ రావడం చాలా ఆనందంగా ఉందన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్‌. ఎక్కువ సినిమాలు తాను చూడకపోయినా… రాంచరణ్ నటించిన ఓ నాలుగు సినిమాలు చూసినట్టు తెలిపారు.

మగధీర, ధ్రువ, రంగస్థలం మూవీలు ఫ్యామిలీతో కలిసి చూశానని చెప్పారు. అందులో ధ్రువ బాగా నచ్చిందని… అందులో రాంచరణ్ సహజంగా నటించారని అభినందించారాయన. ఆయనకు దర్శకత్వం వహిస్తున్న రాజమౌళిని కూడా పొగడ్తలతో ముంచెత్తారు సజ్జనార్‌. నాలుగు రోజుల పాటు స్పోర్ట్స్‌ ఈవెంట్‌లో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని అభినందించారు. గ్రాండ్ ఈవెంట్ సక్సెస్‌ కావడంపై అటు సైబరాబాద్ సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి : 

Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్​జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్..
Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్‌ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..