Lakshya Sen Bronze Medal Match: భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్య సేన్ పారిస్ ఒలింపిక్స్ 2024 లో కాంస్య పతకం సాధించడంలో విఫలమయ్యాడు. నేడు జరిగిన కాంస్య పతక పోరులో మలేషియాకు చెందిన లీ జీ జియాతో తలపడ్డాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ స్టార్ తడబడ్డాడు. తొలి సెట్ గెలిచిన తర్వాత.. దూకుడిగా కనిపించాడు. కానీ, లీ జీ ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. వరసుగా రెండు సెట్లు (13-21, 21-16, 20-11) గెలిచి, భారత ఆటగాడి ఆశలకు బ్రేక్ వేశాడు. కాగా, ఈ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ నుంచి భారత్‌కు ఒక్క పతకం కూడా రాకపోవడం గమనార్హం.
కాగా, పురుషుల సింగిల్స్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ విక్టర్ అక్సెల్సెన్ చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. విక్టర్ 22-20, 21-14 వరుస సెట్లలో లక్ష్య సేన్‌ను ఓడించాడు. అయితే విక్టర్ కూడా మెచ్చుకునే రీతిలో లక్ష్యసేన్ సత్తా చాటాడు. మ్యాచ్ అనంతరం ఈరోజు నా అత్యంత కఠినమైన మ్యాచ్ అని, లక్ష్యకు ఉజ్వల భవిష్యత్తు ఉందని చెప్పుకొచ్చాడు. 4 సంవత్సరాల తర్వాత, 2028 ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవడానికి లక్ష్య బలమైన పోటీదారుగా ఉంటాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు.
ఈసారి బ్యాడ్మింటన్‌లో భారత ప్రదర్శన ప్రత్యేకంగా ఏమీ లేదు. పీవీ సింధు పతకం కోసం అతిపెద్ద పోటీదారుగా ఉంది. అయితే, ఆమె ప్రయాణం సెమీ-ఫైనల్‌కు ముందే ముగిసింది. గత రెండు ఒలింపిక్స్‌లో నిరంతరం పతకాలు సాధిస్తున్న ఆమె ఈసారి ఆ ఫీట్‌ను పునరావృతం చేయలేకపోయింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..