Neeraj Chopra: నెల రోజుల ఆలస్యంగా స్వదేశానికి నీరజ్ చోప్రా.. ఎందుకో తెలుసా?

|

Aug 13, 2024 | 3:44 PM

Neeraj Chopra Left For Germany: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారతదేశానికి ఏకైక రజత పతకాన్ని సాధించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గురించి కీలక విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు ఆలస్యంగా ఇంటికి తిరిగి రానున్నాడంట. నీరజ్ చోప్రా పారిస్ నుంచి నేరుగా జర్మనీకి బయలుదేరంట. అందకు గల కారణం కూడా బయటకు వచ్చింది.

Neeraj Chopra: నెల రోజుల ఆలస్యంగా స్వదేశానికి నీరజ్ చోప్రా.. ఎందుకో తెలుసా?
Neeraj Chopra
Follow us on

Neeraj Chopra Left For Germany: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారతదేశానికి ఏకైక రజత పతకాన్ని సాధించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గురించి కీలక విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు ఆలస్యంగా ఇంటికి తిరిగి రానున్నాడంట. నీరజ్ చోప్రా పారిస్ నుంచి నేరుగా జర్మనీకి బయలుదేరంట. అందకు గల కారణం కూడా బయటకు వచ్చింది. దీంతో భారత అథ్లెట్లతో కలిసి ఆయన భారత్‌కు రాడని తేలిపోయింది. ఆ కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నీరజ్ హెర్నియాతో బాధపడుతున్నాడంట. ఇటువంటి పరిస్థితిలో, మెడికల్ చెకప్ కారణంగా, అతను జర్మనీకి వెళ్లమని డాక్టర్లు సూచించారంట. అవసరమైతే అతని శస్త్రచికిత్స కూడా అక్కడే జరుగుతుందంట. ఆ తరువాత, నీరజ్ ఇంటికి తిరిగి వస్తాడంట.

నీరజ్ చోప్రా నెల రోజుల పాటు జర్మనీలోనే..

వాస్తవానికి, పారిస్ ఒలింపిక్స్ జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగాయి. ముగింపు వేడుక తర్వాత నీరజ్ చోప్రాతో సహా అథ్లెట్లందరూ ఆగస్టు 13న భారత్‌కు తిరిగి వస్తారని వార్తలు వచ్చాయి. అయితే దీనికి ముందు నీరజ్ మేనమామ భీమ్ చోప్రా నీరజ్ ఇండియాకు రావడం లేదని తెలిపాడు.

నీరజ్ తన చికిత్స కోసం పారిస్ నుంచి నేరుగా జర్మనీకి వెళ్లినట్లు ఆయన తెలిపాడు. అవసరమైతే అక్కడే శస్త్ర చికిత్స చేయిస్తామని తెలిపాడు. నీరజ్ చోప్రా దాదాపు నెల రోజుల పాటు జర్మనీలోనే ఉంటారని భీమ్ చోప్రా కూడా స్పష్టం చేశారు.

పతకం గెలిచిన తర్వాత నీరజ్ ఏమన్నాడంటే..

నివేదికల మేరకు, టాప్-3 వైద్యులు నీరజ్‌కు శస్త్రచికిత్స చేయవచ్చు. అయితే తుది నిర్ణయం మాత్రం నీరజ్ తీసుకోవాల్సి ఉంది. గజ్జల్లో సమస్య కారణంగా నీరజ్ ఇటీవలి కాలంలో చాలా తక్కువ టోర్నీలు ఆడాడు. పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ ఫైనల్ మ్యాచ్ తర్వాత నీరజ్ శస్త్రచికిత్స గురించి కూడా సూచించాడు.

‘నా టీమ్‌తో మాట్లాడి తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటా’ అంటూ చెప్పుకొచ్చాడు. నా శరీరం ప్రస్తుత పరిస్థితి ఉన్నప్పటికీ నన్ను నేను ముందుకే వెళ్లాలని కోరుకుంటున్నాను. నాలో ఇంకా చాలా ఆట మిగిలి ఉంది. దానికి నన్ను నేను ఫిట్‌గా ఉంచుకోవాల్సి ఉంటుందని అన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..