Indian Swimmers In Uzbekistan: కొనసాగుతోన్న భారత స్విమ్మర్ల పతకాల వేట.. పసిడి గెలుచుకున్నా ఆ అవకాశం కోల్పోయిన నటరాజ్..

|

Apr 16, 2021 | 6:38 PM

Indian Swimmers In Uzbekistan: ఉజ్బెకిస్తాన్‌లో జరుగుతోన్న అంతర్జాతీయ స్విమ్మింగ్‌ టోర్నమెంట్‌లో భారత ప్లేయర్లు తమ సత్తా చాటుతున్నారు. అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తూ...

Indian Swimmers In Uzbekistan: కొనసాగుతోన్న భారత స్విమ్మర్ల పతకాల వేట.. పసిడి గెలుచుకున్నా ఆ అవకాశం కోల్పోయిన నటరాజ్..
Indian Swimmers
Follow us on

Indian Swimmers In Uzbekistan: ఉజ్బెకిస్తాన్‌లో జరుగుతోన్న అంతర్జాతీయ స్విమ్మింగ్‌ టోర్నమెంట్‌లో భారత ప్లేయర్లు తమ సత్తా చాటుతున్నారు. అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తూ పతకాల వేటను కొనసాగిస్తున్నారు. గురువారం ఒక్క రోజే ఎనిమిది పతకాలను కైవసం చేసుకుని సత్తా చాటారు. వీటిలో ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు కాగా ఒక కాంస్యం ఉంది.

స్వర్ణం గెలిచినా.. ఒలిపింక్స్‌ మిస్‌..

ఇక తమిళనాడుకు చెందిన శ్రీహరి నటరాజ్‌ స్వర్ణం సొంతంచేసుకున్నాడు. పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో నటరాజ్‌ 54.07 సెకన్లలో రేసును పూర్తి చేసి విజేతగా నిలిచాడు. అయితే శ్రీహరి 0.22 సెకన్లతో టోక్యో ఒలింపిక్స్‌ ‘ఎ’ గ్రేడ్‌ అర్హత ప్రమాణాన్ని (53.85 సెకన్లు) కోల్పోయాడు. 2019 ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో శ్రీహరి టోక్యో ఒలింపిక్స్‌ గ్రేడ్‌ ‘బి’ అర్హత ప్రమాణాన్ని అందుకున్నాడు. గ్రేడ్‌ ‘ఎ’ ప్రమాణం ఉంటే నేరుగా ఎంట్రీ లభిస్తుంది. ఒకవేళ గ్రేడ్‌ ‘ఎ’ కోటాలో ఖాళీలు మిగిలితే గ్రేడ్‌ ‘బి’ సమయం నమోదు చేసిన వారికి అవకాశం లభిస్తుంది.

టోర్నీలో మూడో స్వర్ణం కైవసం చేసుకున్న సజన్‌..

పురుషుల 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో సజన్‌ ప్రకాశ్‌ 3ని.56.03సెకన్లలో ఓ పసిడి పతకం గెలిచాడు. ఈ టోర్నీలో సజన్‌కు ఇది మూడో పసిడి పతకం కావడం విశేషం. వీరితో పాటు.. మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో మానా పటేల్‌ (1ని:04.47 సెకన్లు) బంగారు పతకాన్ని గెల్చుకుంది. పురుషుల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌ ఈవెంట్‌లో లిఖిత్, ధనుశ్‌ వరుసగా రజతం, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు.

Also Read: కూరగాయలు సర్దుతుండగా భార్యాభర్తలకు ఊహించని షాక్.. పాలకూర‌లో నక్కిన పాము.. భయానక వీడియో.!

PM Modi on oxygen: ప్రాణవాయువు కొరత రానివ్వకండి.. ఆక్సిజన్‌ లభ్యత, వినియోగంపై ప్రధాని మోదీ సమీక్ష

Myanmar: పండగ వేడుకలతోనే నిరసనన తెలుపుతున్న ప్రజలు..ఎందుకో తెలుసా?