చాంగ్వాన్ (దక్షిణ కొరియా)లో జరుగుతున్న షూటింగ్ ప్రపంచకప్‌లో భారత యువ షూటర్ ఐశ్వర్య ప్రతాప్ సింగ్ రెండో బంగారు పతకం సాధించింది. 50మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో ఐశ్వర్య మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఈవెంట్‌లో ఇప్పటి వరకు నాలుగు బంగారు పతకాలు సాధించి పతకాల పట్టికలో భారత్ మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. ఐశ్వర్య జూనియర్ ప్రపంచ ఛాంపియన్ కూడా నిలిచింది. అత్యంత కష్టతరమైన షూటింగ్ ఈవెంట్ 50m 3 పొజిషన్ రైఫిల్ ఈవెంట్ అత్యంత క్లిష్టమైన షూటింగ్ ఈవెంట్‌లలో ఒకటిగా పరిగణిస్తుంటారు. ఇందులో, షూటర్లు 3 వేర్వేరు స్థానాల్లో గురి పెట్టాలి. మొదటి స్థానంలో నిలబడి కాల్చాల్సి ఉంటుంది. రెండవ స్థానంలో మోకాళ్లపై కూర్చోని కాల్చాలి. అదే సమయంలో మూడో స్థానంలో పడుకుని లక్ష్యాన్ని చేధించాల్సి ఉంటుంది.
హంగేరీకి చెందిన జకాన్ పెక్లర్ మధ్య బంగారు పతకం కోసం హోరాహోరీ పోరు సాగింది. చివరికి 16-12తో ఐశ్వర్య విజయం సాధించింది. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్‌లో ఐశ్వర్య అద్భుత ప్రదర్శన చేసి 409.8 పాయింట్లు సాధించింది. క్వాలిఫైయింగ్ రౌండ్‌లో పెక్లర్ 406.7 పాయింట్లు సాధించాడు. మను భాకర్ స్వల్ప తేడాతో పతకాన్ని కోల్పోయింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో మను నాలుగో స్థానంలో నిలిచింది. శనివారం ఉదయం జరిగిన క్వాలిఫైయింగ్ రౌండ్‌లో మను 581 స్కోరుతో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు.
ప్రస్తుతం అంజుమ్ మౌద్గిల్ ఆదివారం కూడా భారత్ పతకాల సంఖ్యను పెంచుకుంటుదని భావిస్తున్నారు. మహిళల 50 మీటర్ల 3 పొజిషన్ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన అంజుమ్ మౌద్గిల్ ఫైనల్‌కు చేరుకుంది. అంజుమ్ క్వాలిఫయర్స్‌లో 586 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించింది.
GOLD ?!! #aishwarytomar wins Men’s individual 50 metre 3position at ISSF #WorldCup at #changwon #Korea @OfficialNRAI @Media_SAI @IndiaSports #coachlife #goldmedal ?? #teamindia @ianuragthakur @WeAreTeamIndia @OlympicKhel @RaninderSingh @DeoKalikesh pic.twitter.com/5sVVTMD1JF
— Joydeep Karmakar OLY (@Joydeep709) July 16, 2022
భారత్ పేరిట ఇప్పటివరకు 9 పతకాలు..
ఈ ప్రపంచకప్‌లో భారత జట్టు ఇప్పటివరకు 9 పతకాలు సాధించింది. ఇందులో 4 బంగారు, 4 రజత, 1 కాంస్య పతకాలు ఉన్నాయి. భారత్ మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఉన్న కొరియా 4 పతకాలు సాధించింది. కొరియా 3 స్వర్ణాలు, 1 కాంస్యం సాధించింది. సెర్బియా మూడు స్వర్ణాలతో మూడో స్థానంలో ఉంది.