Olympics 2036: భారతదేశంలోనే 2036 ఒలింపిక్ గేమ్స్.. ఐఓసీ సెషన్‌లో ప్రకటించిన ప్రధాని మోదీ..

PM Narendra Modi: ఒలంపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం చాలా ఉత్సుకతతో ఉందని, 2036లో జరిగే క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి ఏ మాత్రం వెనుకాడబోమని ప్రధాని అన్నారు. తమ ఇంట్లో ఒలింపిక్స్‌ను చూడాలన్నది భారత ప్రజల కల అని, ఐఓసీ సహకారంతో కోట్లాది మంది భారతీయుల ఈ కలను నెరవేర్చాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. క్రీడల ద్వారా పతకాలు మాత్రమే కాకుండా మనసులు కూడా గెలుస్తామని మోదీ అన్నారు.

Olympics 2036: భారతదేశంలోనే 2036 ఒలింపిక్ గేమ్స్.. ఐఓసీ సెషన్‌లో ప్రకటించిన ప్రధాని మోదీ..
Pm Narendra Modi

Updated on: Oct 15, 2023 | 5:24 PM

Olympics 2036: భారతదేశం ప్రస్తుతం ODI క్రికెట్ అంటే ప్రపంచ కప్‌నకు ఆతిథ్యం ఇస్తోంది. అయితే, వీటి తర్వాత భారత్ దృష్టి క్రీడల మహాకుంభ్ అంటే ఒలింపిక్ క్రీడలపై నెలకొంది. 2036లో జరిగే ఒలింపిక్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం చెప్పుకొచ్చారు. ముంబైలోని వరల్డ్ సెంటర్‌లో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సమావేశంలో మోదీ ఈ విషయం చెప్పారు. భారత్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వలేదు. 2010లో కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఇది కాకుండా, భారతదేశం 1982లో న్యూఢిల్లీలో ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది.

ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ కంటే అతిపెద్ద ఈవెంట్ ఒలింపిక్ క్రీడలు. ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం గురించి నరేంద్ర మోడీ చాలాసార్లు మాట్లాడారు. కానీ, IOC సెషన్‌లో, మోడీ అధికారికంగా భారతదేశం ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

‘ఏ అవకాశాన్ని వదిలిపెట్టను’

ఒలంపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం చాలా ఉత్సుకతతో ఉందని, 2036లో జరిగే క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి ఏ మాత్రం వెనుకాడబోమని ప్రధాని అన్నారు. తమ ఇంట్లో ఒలింపిక్స్‌ను చూడాలన్నది భారత ప్రజల కల అని, ఐఓసీ సహకారంతో కోట్లాది మంది భారతీయుల ఈ కలను నెరవేర్చాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. క్రీడల ద్వారా పతకాలు మాత్రమే కాకుండా మనసులు కూడా గెలుస్తామని మోదీ అన్నారు. ఈ క్రీడలు ఛాంపియన్‌లను సృష్టించడమే కాకుండా శాంతిని ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు.

యూత్ ఒలింపిక్స్‌పైనా దృష్టి..

2036లో జరిగే ఒలింపిక్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా 2029లో జరిగే యూత్ ఒలింపిక్స్‌కు కూడా ఆతిథ్యం ఇస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఐఓసీ నుంచి భారత్‌కు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ రెండోసారి ఐఓసీ సెషన్‌ను నిర్వహిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..