Hero Siddharth: సైనాపై నేను చేసింది జోక్ మాత్రమే ఆమె గొప్ప క్రీడాకారిణి అంటూ.. బహిరంగంగా క్షమాపణ చెప్పిన హీరో సిద్ధార్ద్..

hero siddharth: ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ (Saina Nehwal) ప్రధానమంత్రి మోడీ పంజాబ్ పర్యటనపై చేసిన ట్వీట్ పై హీరో సిద్ధార్థ్ (Siddharth Actor)స్పందిస్తూ చేసిన ట్వీట్..

Hero Siddharth: సైనాపై నేను చేసింది జోక్ మాత్రమే ఆమె గొప్ప క్రీడాకారిణి అంటూ.. బహిరంగంగా క్షమాపణ చెప్పిన హీరో సిద్ధార్ద్..
Siddhartha Saina Nehwal

Updated on: Jan 12, 2022 | 7:14 AM

Hero Siddharth: ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ (Saina Nehwal) ప్రధానమంత్రి మోడీ పంజాబ్ పర్యటనపై చేసిన ట్వీట్ పై హీరో సిద్ధార్థ్ (Siddharth Actor)స్పందిస్తూ చేసిన ట్వీట్ వివదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. సబ్టిల్ కాక్ ఛాంపియన్ ఆఫ్ వరల్డ్…అంటూ సైనా పై చేసిన వ్యాఖ్యలపై ఎంతో మంది ప్రముఖులు స్పందిస్తూ తమదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి, చిన్మయి, సైనా తండ్రి, సైనా నెహ్వాల్ భర్త, బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ సహా పలురువు సోషల్ మీడియా వేదికగా సిద్ధార్ద్ (Siddharth tweet) చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. తమ నిరసన వ్యక్తం చేశారు. సిద్ధార్థ్ తను చేసిన ట్వీట్ ద్వారా ఎవరిని అగౌరవపరిచ లేదు అంటూ వివరించే ప్రయత్నం చేశారు. తాజాగా నటుడు సిద్ధార్ద్ ట్విట్టర్ వేదికగా తను పెట్టిన కామెంట్స్ పై మళ్ళీ స్పందించారు.

బాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ కి క్షమాపణలు చెబుతూ సిద్ధార్ధ్ బహిరంగ లేఖ విడుదల చేశారు. సైనా పెట్టిన ట్వీట్ మీద తాను పెట్టిన పోస్ట్ ఒక జోక్ మాత్రమే నని వివరణ ఇచ్చారు. అయితే తాను పెట్టిన కామెంట్ చాలా మందిని బాధించిందని అన్నారు. అయితే తనకు మహిళలను కించపరుస్తూ కామెంట్స్ చేయాలనే ఉద్దేశ్యం తనది కాదంటూ వివరణ ఇచ్చారు. సైనా నెహ్వాల్ ఎప్పుడు ఒక గొప్ప క్రీడాకారిణి అని.. తాను ఆమెను గౌరవిస్తానని అన్నారు. అంతేకాదు తాను పెట్టిన పోస్టు చాలా మందిని బాధపెట్టిందని.. కనుక అలాంటి తాను పోస్ట్ చేసిన కామెంట్స్ పై క్షమాపణ కోరుతున్నానని అన్నారు నటుడు సిద్ధార్ధ్.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన సమయంలో ఆయనపై దాడి చేయడంతో దేశ ప్రధానికి రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి అన్న విధంగా ఆ ఘటన పై స్పందిస్తూ సైనా నెహ్వాల్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read:

ధ‌నుష్ సినిమా నుంచి సంయుక్త త‌ప్పుకుందా..? ఈ వార్త‌లో నిజ‌మెంత‌..

ఏంటమ్మా అనుపమ ఇంతపని చేశావ్.. బరువెక్కిన గుండెతో ఫ్యాన్స్ కామెంట్స్..