Watch Video: ముచ్చటగా మూడోసారి.. ప్రపంచ ఛాంపియన్‌కు షాకిచ్చిన 17 ఏళ్ల భారత గ్రాండ్ మాస్టర్.. వీడియో

|

Aug 22, 2022 | 1:01 PM

Praggnanandhaa vs Magnus Carlsen: USAలోని మియామీలో జరుగుతున్న FTX క్రిప్టో కప్‌లో ప్రజ్ఞానానంద ఈ విజయాన్ని నమోదు చేశాడు. ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది.

Watch Video: ముచ్చటగా మూడోసారి.. ప్రపంచ ఛాంపియన్‌కు షాకిచ్చిన 17 ఏళ్ల భారత గ్రాండ్ మాస్టర్.. వీడియో
Praggnanandhaa Vs Magnus Carlsen
Follow us on

Praggnanandhaa: 17 ఏళ్ల భారత చెస్ ప్లేయర్ ప్రజ్ఞానానంద మరోసారి ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడించాడు. USAలోని మియామీలో జరుగుతున్న FTX క్రిప్టో కప్‌లో ప్రజ్ఞానానంద ఈ విజయాన్ని నమోదు చేశాడు. ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. టై-బ్రేక్‌కి దారితీసే ఈ మ్యాచ్‌లో, కార్ల్‌సెన్ విజయాన్ని నమోదు చేయడానికి దగ్గరగా ఉన్నాడు. కానీ, చివరిలో అతను చేసిన చిన్న పొరపాటుతో మ్యాచ్‌ను కోల్పోయాడు.

ఈ బిగ్ మ్యాచ్ చివరి క్షణాల వీడియో చూస్తే మాత్రం. ప్రగ్నానంద ఇక్కడ తన చివరి అడుగు వేసిన వెంటనే కార్ల్సన్ ఆశ్చర్యపోయాడు. ప్రజ్ఞానానంద చేతిలో మరోసారి ఓడిపోవడంతో నమ్మలేకపోయాడు. దీని తర్వాత అతను నెమ్మదిగా తన హెడ్‌ఫోన్‌లను తీసేసి, ప్రజ్ఞానానందకు కంగ్రాట్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఇవి కూడా చదవండి

టోర్నీలో రెండో స్థానంలో నిలిచిన భారత చెస్ ఆటగాడు ప్రజ్ఞానానంద ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించినప్పటికీ మొత్తం స్కోరు ఆధారంగా ఈ టోర్నీని గెలవలేకపోయాడు. మొత్తంగా ఈటోర్నీలో రెండో స్థానంలో నిలిచాడు. ఇక్కడ మాగ్నస్ కార్ల్‌సెన్ విజేతగా నిలిచాడు. ప్రజ్ఞానంద ఈ టోర్నీని ఘనంగా ప్రారంభించాడు. వరుసగా 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించాడు. అయితే ఐదో, ఆరో రౌండ్లలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

ఫిబ్రవరిలో తొలిసారి..

ప్రజ్ఞానానంద ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలిసారి హాట్‌ టాపిక్‌గా మారాడు. ఆ తర్వాత అతను ఎయిర్‌థింగ్ మాస్టర్స్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్సన్‌ను ఓడించాడు. దీని తరువాత, అతను మేలో చెస్సబుల్ మాస్టర్స్ ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో కార్ల్‌సెన్‌ను రెండోసారి ఓడించాడు.