Maradona Watch: అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం డీగో మారడోనాకు చెందిన ఖరీదైన వాచ్ కొంతకాలం కిందట మాయమైంది. ఇప్పుడా గడియారం అసోంలో లభ్యమైంది. మారడోనా గతేడాది గుండెపోటుకు గురై మరణించాడు. ఆయనకు చెందిన పలు ఖరీదైన వస్తువులు దుబాయ్‌లోని ఓ మ్యూజియంలో భద్రపరిచిన డీగో మారడోనా చేతి గడియారం చోరీకి గురయింది. ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించిన దుబాయ్ పోలీసులు.. అక్కడ సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్న అస్సాం రాష్ట్రానికి చెందిన వాజిద్ హుస్సేన్‌తో పాటు పలువురు అనుమానితులను విచారించి వదిలేశారు. స్పాట్..
అనంతరం ఏదో విధంగా భారత్‌కు వచ్చిన వాజిద్ హుస్సేన్‌పై స్థానిక పోలీసులతో సహకారంతో నిఘా ఉంచారు ఇంటర్ ఫోల్ పోలీసులు. అస్సాంలోని తన స్వస్థలంలో ఉంటున్న.. హుస్సేన్ ఇంటిపై పోలీసు బృందం సోదాలు నిర్వహించారు. మారడోనా చేతి గడియారాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇరుదేశాల పోలీసుల పరస్పర సహకారంతోనే విజయవంతంగా ఈ ఆపరేషన్ చేపట్టారు.
Also read:
Children Fear: కొత్తవారంటే పిల్లలు ఎందుకు భయపడుతుంటారు..? చైల్డ్ సైకాలజీ నిపుణులు ఏమంటున్నారంటే..!
Kishmish Benefits: ఎండుద్రాక్షతో అదిరిపోయే బెనిఫిట్స్.. ఆ విషయంలో పిల్లలకు ఎంతో ఉపయోగం..!