
FIFA World Cup 2026 : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫుట్‌బాల్ ఫీవర్ విపరీతంగా నడుస్తోంది. గ్రౌండ్‌లో మ్యాచులు హోరాహోరీగా సాగుతున్న తరుణంలో.. బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు నెయ్మార్ అభిమానులకు ఒక శుభవార్త అందింది. ఈ స్టార్ స్ట్రైకర్ త్వరలోనే ఐదోసారి తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని నెయ్మార్ లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్, ప్రముఖ మోడల్ బ్రూనా బయాన్‌కార్డి సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ధృవీకరించడంతో ఈ వార్త కాస్త అంతర్జాతీయంగా వైరల్‌గా మారింది.
బ్రూనా బయాన్‌కార్డి తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ఒక స్పెషల్ వీడియోను అప్‌లోడ్ చేయడం ద్వారా ఈ తీపి కబురును ప్రపంచంతో పంచుకుంది. ఈ క్యూట్ వీడియోలో బ్రూనాతో పాటు నెయ్మార్ ముగ్గురు పిల్లలు కూడా కనిపించి సందడి చేశారు. నెయ్మార్ పెద్ద కొడుకు డావి లుక్కా, కుమార్తెలు మావి, మెల్ ఈ వీడియోలో చాలా సంతోషంగా కనిపించారు. నెయ్మార్ చిన్న కుమార్తె మెల్ పుట్టి కనీసం ఏడాది కూడా గడవక ముందే.. బ్రూనా మళ్లీ గర్భం దాల్చడం, ఐదో బిడ్డ రాకను ప్రకటించడం విశేషం.
ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నీలో బ్రెజిల్ జట్టులో నెయ్మార్ అత్యంత కీలకమైన ఆటగాడు. అయితే దురదృష్టవశాత్తూ గాయం కారణంగా మొరాకోతో జరిగిన బ్రెజిల్ మొదటి మ్యాచ్‌లో నెయ్మార్ బరిలోకి దిగలేకపోయాడు. బెంచ్‌కే పరిమితమై ఒత్తిడిలో ఉన్న నెయ్మార్‌కు ఈ ప్రెగ్నెన్సీ వార్త మానసికంగా పెద్ద ఊరటనిచ్చింది. కాగా, ఈ వరల్డ్ కప్ టూర్ ముగిసే వరకు నెయ్మార్‌కు మద్దతుగా ఉండటానికి బ్రూనా బయాన్‌కార్డి కూడా ప్రస్తుతం అతనితోనే బ్రెజిల్ క్యాంప్‌లో కలిసి ఉంటోంది.
నెయ్మార్ ఐదోసారి తండ్రి కాబోతున్నప్పటికీ.. బ్రూనా బయాన్‌కార్డి ద్వారా అతనికి ఇది మూడో సంతానం కానుంది. వీరికి ఇప్పటికే మావి, మెల్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నెయ్మార్‌కు గతంలో బ్రెజిల్ మోడల్ అమాండా కింబర్లీతో ఉన్న సంబంధం ద్వారా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందులో పెద్ద కొడుకు డావి లుక్కా ఒకరు కాగా.. హెలెనా అనే మరో కుమార్తె కూడా ఉంది. ఇలా వేర్వేరు సంబంధాల ద్వారా నెయ్మార్‌కు ఇప్పటికే నలుగురు పిల్లలు ఉండగా, ఇప్పుడు రాబోయే ఐదో బిడ్డతో నెయ్మార్ ఇల్లు మరింత సందడిగా మారబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెయ్మార్ అభిమానులు ఈ స్టార్ క్రీడాకారుడికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి