Euro 2020 final: ఈ ఆదివారం క్రీడాభిమానులకు మహావిందు లాంటింది. ఇప్పటికే కోపా అమెరికా కప్ ఫైనల్ పూర్తవ్వగా, మరో మహా సంగ్రామనికి తెరలేవనుంది. యూరో 2020 ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్ మరికొద్ది గంటల్లో ఆరంభం కానుంది. అలాగే వింబుల్డన్ ఫైనల్లో ఇటలీ ఆటగాడు మాటో బెరిటినితో సెర్బియా స్టార్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ తలపడనున్నాడు. దీంతోపాటు టీమిండియా మహిళలు, ఇంగ్లండ్ మహిళలతో రెండవ టీ20లో తలపడనున్నారు. ఇక యూరో కప్ విషయానికి వస్తే.. నేడు ( అర్ధరాత్రి దాటాక గం. 12:30) లండన్‌లోని విఖ్యాత వెంబ్లీ స్టేడియంలో ఈ మహా సంగ్రామం జరగనుంది. ఫైనల్‌లో ఇంగ్లండ్, ఇటలీ టీంలు అమీతుమీకి రెడీ అయ్యాయి. 55 ఏళ్ల తరువాత తొలిసారి ఇంగ్లండ్ ఓ ప్రధాన టోర్నీ ఫైనల్ ఆడనుంది. తొలిసారి యూరో కప్ అందుకోవాలని ఆశ పడుతోంది. అలాగే వరుస విజయాలతో టోర్నీలో ఇటలీ దూసుకపోతుంది. యూరోకప్‌లో ఇటలీ రెండోసారి కప్ సాధించేందుకు ఆరాపడుతోంది. చివరిసారి 1968లో ఇటలీ జట్టు ఛాంపియన్‌గా నిలించింది. గత 33 మ్యాచ్‌ల్లో ఇటలీ ఓటమిని ఎరుగలేదు. ఇరు జట్లు కూడా లీగ్ దశ నుంచి చక్కని ఆటతీరు ప్రదర్శిస్తూ ఫైనల్‌కు అర్హత సాధించాయి. యూరో కప్ ఫైనల్ మ్యాచ్‌ను సోనీ సిక్స్ చానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
సొంతగడ్డపై ఆడుతుండడంతో.. ఇంగ్లాండ్ టీం ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది.1966 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన ఇంగ్లాండ్.. ఓ మెగా టోర్నీ ఫైనల్‌కు తొలిసారి చేరుకుంది. యూరో కప్‌లో ఇంగ్లండ్ టీంకిదే తొలి ఫైనల్. అలాగే ఇంగ్లండ్ కెప్టెన్, ఫార్వర్డ్ హ్యారీ కేన్ సూపర్ ఫామ్‌తో రాణిస్తుడడం, రహీమ్ స్టెర్లింగ్, డిఫెండర్లు.. మెగ్వాయోర్, లూక్ షా, జాన్ స్టోన్స్, గోల్‌కీపర్ జోర్డాన్ లాంటి అత్యుత్తమ ఆటగాళ్లతో ఇంగ్లండ్ టీం పటిష్ఠంగా కనిపిస్తోంది. అలాగే ఇంగ్లండ్ జట్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మరోవైపు 1968లో యూరో కప్‌లో ఇటలీ విజేతగా నిలిచింది. రెండవ సారి టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది. 2000, 2012లో ఇటలీ జట్టు ఫైనల్ చేరినా.. ఫైనల్ పోరులో నిరాశ పరిచింది. 2018 ప్రపంచకప్‌కు ఇటలీ అర్హత సాధించడంలో విఫలమైంది. ఇక ఆ కసితో తరువాత ఆడిన మ్యాచుల్లో అపజయమే లేకుండా దూసుకెళ్తోంది. గత 33 మ్యాచ్‌ల్లో ఇటలీ వరుసగా గెలుస్తూ వస్తోంది. ప్రధాన టోర్నీల్లో ఇంగ్లండ్ పై ఇటలీదే పైచేయిగా ఉంది. ఒక్క మ్యాచులోనూ ఓడిపోకుండా ఇంగ్లండ్‌పై ఆధిపత్యం చెలాయిస్తోంది. దాంతో ఈ మ్యాచులోనూ విజయం సాధించి, రెండవ సారి యూరోకప్‌ను ముద్దాడాలని చూస్తోంది. ఇక ఇటలీ టీంలో లోరెంజో, సిరో, ఫెడెరికోలతో లాంటి ఫార్వర్డులదో ప్రత్యర్థలను కోలుకోనివ్వకుండా చేస్తున్నారు. కెప్టెన్ చీలిని కూడా ఆకట్టుకుంటున్నాడు. కాగా, ఇప్పటివరకూ ఇంగ్లండ్, ఇటలీ జట్లు 27 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. దీంట్లో ఇటలీ 11, ఇంగ్లాండ్ 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి.
? EURO 2020 final…
??????? Scenes! Amazing send-off for England as the team depart St. George’s Park ???#ThreeLions | #EURO2020 pic.twitter.com/dUY7stZRry
— UEFA EURO 2020 (@EURO2020) July 10, 2021
?????????? Italy vs England EURO 1980 edition…
Who was your hero growing up? ?#EURO2020 pic.twitter.com/5BwNDF3NcX
— UEFA EURO 2020 (@EURO2020) July 11, 2021
? 1 DAY TO GO! ?
The #EURO2020 final is almost upon us ? pic.twitter.com/9ghsA2mvF4
— UEFA EURO 2020 (@EURO2020) July 10, 2021
Also Read:
Copa America Final 2021: మెస్సీ భావోద్వేగం… కన్నీళ్లతో శాంటోస్… ఆకట్టుకున్న దిగ్గజ ఆటగాళ్లు!
Copa America Final 2021: మెస్సీ లోటు తీరింది.. ఫైనల్‌లో బ్రెజిల్ పై అర్జెంటీనా అద్భుత విజయం..