పోర్చుగల్ స్టార్ సాకర్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఓ సంచలన ప్రకటన చేశాడు. సాఫ్ట్ డ్రింక్ సామ్రాజ్యాన్ని శాసిస్తున్న ఓ బ్రాండ్ డ్రింక్ తగొద్దు అంటూ ప్రెస్ మీట్ ప్రకటించాడు. ఈ అంతర్జాతీయ ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు… ప్రస్తుతం యూరో చాంపియన్‌షిప్ పోటీల్లో భాగంగా మంగళవారం తన తొలి మ్యాచ్ ఆడబోతున్నాడు. హంగరీతో బుడాపెస్ట్‌లో ఈ మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడేందుకు మీడియా ముందుకు వచ్చాడు. సమావేశానికి వచ్చి కూర్చుంటున్న సమయంలో అతని ముందు రెండు సాఫ్ట్ డ్రింక్ బాటిల్స్ కనిపించాయి. వాటిని చూసిన వెంటనే తీసి పక్కన పెట్టేశాడు. ఇది పక్కనే కూర్చున్న కోచ్ శాంటోస్‌తోపాటు మీడియాను కూడా ఆశ్చర్యపరిచింది.
అతను ఎందుకిలా చేస్తున్నాడో అర్థం కాలేదు. ఆ తర్వాత వెంటనే అతడే అసలు విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఈ సాఫ్ట్ డ్రింక్‌కు బదులుగా నీళ్లు తాగండి అంటూ అక్కడే ఉన్న వాటర్ బాటిల్‌ను చేతికి తీసుకుని పైకెత్తి చూపించాడు. వరల్డ్‌లోని బెస్ట్ ఫుల్‌బాలర్స్‌లో ఇక్కసారిగా ఇలా చేయడంతో అక్కడే ఉన్న మీడియాతోపాటు కంపెనీ ప్రతినిధులను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రపంచ స్థాయికి ఎదుగిన రొనాల్డో.. ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాడు.
ఇందులోభాగంగా ఆయన జంక్ ఫుడ్స్‌కు పూర్తిగా దూరంగా ఉంటాడని ప్రచారం. యూరో కప్ అనే కాదు కానీ ఇలాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్‌కు డ్రింక్ కంపెనీలే స్పాన్సర్ చేస్తుంటాయి. వాటిని ప్లేయర్స్ మీడియా సమావేశాల్లోనూ ప్రదర్శించాలనుకుంటాయి. కానీ రొనాల్డోలాంటి స్టార్ ప్లేయరే పబ్లిగ్గా ఇలా తాగొద్దని ప్రకటన చేయడంతో ఆ కంపెనీలకు షాక్ తగిలినంత పనైంది.