Copa America Final 2021: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసినా.. వెక్కిరించింది. దిగ్గజ ఆటగాళ్లు ఉన్నా.. అద్భుతమైన జట్టుగా పేరుగాంచినా.. ట్రోఫీ కోసం 28 ఏళ్లుగా నిరీక్షణ తప్పలేదు. మారడోనా లాంటి దిగ్గజానికి సైతం అందని కోపా అమెరికా కప్.. ఎట్టకేలకు మెస్సీ సారథ్యంలో అందుకుంది. ఆదివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఢిపెడింగ్ ఛాంపియన్ బ్రెజిల్‌ను ఓడించి కోపా అమెరికా కప్ 2021 టోర్నీని కైవసం చేసుకుంది. దీంతో ఎన్నో ఏళ్లుగా దోబూచులాడున్న కప్.. చేతికందేసరికి ఆటగాళ్లకు కన్నీళ్లు ఆగలేదు. దిగ్గజ ఆడిగాడిగా పేరుపొందిన మెస్సీ నాయకుడిగా తొలి అంతర్జాతీయ కప్ ను గెలుచుకోవడంతో భావోద్వేగానికి లోనయ్యాడు. అలాగే ఓటమి భారంతో బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెయ్‌మర్ దా సిల్వ శాంటోస్ శోకంతో కూడా కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. ఈ ఇద్దరూ కలిసి ఒకరినొకరు కౌగిలించుకుని కన్నీళ్లతో ఓదార్చుకున్నారు. ఈ సీన్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.
కోపా అమెరికా టోర్నీ 2021 లో దక్షిణ అమెరికా ఖండంలోని మొత్తం పది దేశాలు పాల్గొన్నాయి. లీగ్ మ్యాచ్‌ల అనంతరం అర్జెంటీనా, ఢిపెడింగ్ ఛాంపియన్ బ్రెజిల్ లు తుదిపోరుకు సిద్ధమయ్యాయి. ఈ రోజు వేకువజామున బ్రెజిల్‌లో రియో డీ జనెయిరోలోని మారాకానా స్టేడియంలో ఫైనల్‌లో తలపడ్డాయి. ఆట ప్రథమార్థంలోని ఇరవై రెండో నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు ఏంజెల్ డి మారియా చేసిన గోల్ ఫైనల్ పోరునే మార్చేసింది. దాంతో లియోనెల్ మెస్సీ కెప్టెన్సీలో 15వ కోపా అమెరికా ట్రోఫీని అందుకుంది.
A brilliant moment between Lionel Messi and Neymar at the end of the match!
Sport is ❤️❤️❤️
?️ #CopaAmericapic.twitter.com/XrcL7gIgz1
— Vinay Chandra (@VinayChandra01) July 11, 2021
¡ACÁ ESTÁ LA COPA! Lionel Messi ??? levantó la CONMEBOL #CopaAmérica y desató la locura de @Argentina
?? Argentina ? Brasil ??#VibraElContinente #VibraOContinente pic.twitter.com/PCEX6vtVee
— Copa América (@CopaAmerica) July 11, 2021
What a moment #CopaAmerica pic.twitter.com/LjRllmJorY
— SPORTbible (@sportbible) July 11, 2021
Also Read:
Copa America Final 2021: మెస్సీ లోటు తీరింది.. ఫైనల్‌లో బ్రెజిల్ పై అర్జెంటీనా అద్భుత విజయం..