Australian Open: ప్రపంచ నం.1 ప్లేయర్‌కు షాక్.. ఆస్ట్రేలియాలో ఎంట్రీకి అనుమతి నిరాకరణ, వీసా రద్దు.. ఎందుకో తెలుసా?

|

Jan 06, 2022 | 9:54 AM

Novak DJokovic: ప్రపంచ నంబర్ వన్, టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది గ్రాండ్‌స్లామ్‌ గెలిచి చరిత్ర సృష్టించే అవకాశం జకోవిచ్‌కి ముందుంది.

Australian Open: ప్రపంచ నం.1 ప్లేయర్‌కు షాక్.. ఆస్ట్రేలియాలో ఎంట్రీకి అనుమతి నిరాకరణ, వీసా రద్దు.. ఎందుకో తెలుసా?
Novak Djokovic
Follow us on

Australian Open 2022: కరోనా మధ్య జరుగుతున్న ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు సన్నాహాలు పూర్తయ్యాయి. జనవరి 17 నుంచి ప్రారంభమయ్యే ఈ గ్రాండ్‌స్లామ్‌లో పాల్గొనేందుకు ఆటగాళ్లు మెల్‌బోర్న్ చేరుకోవడం ప్రారంభించారు. ప్రపంచ నంబర్ వన్, 20 గ్రాండ్ స్లామ్ విజేత నొవాక్ జకోవిచ్ కూడా బుధవారం మెల్‌బోర్న్ చేరుకున్నప్పటికీ విమానాశ్రయం దేశంలో అడుగుపెట్టేందుకు అనుమతించలేదు.

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జకోవిచ్ ఢిపెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనున్నాడు. ఈ టోర్నీలో పాల్గొనేందుకు అతనికి ప్రత్యేక వైద్యపరమైన మినహాయింపు ఇచ్చారు. అయితే, ఈ మినహాయింపు పొందడంపై ఎక్కువ దృష్టి పెట్టడంతో, సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ తన వీసాపై పెద్దగా దృష్టి పెట్టలేదని, దీని కోసం ఈ భారాన్ని మోయవలసి ఉందని తెలుస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి జొకోవిచ్ తుల్లామరైన్ విమానాశ్రయానికి చేరుకున్నట్లు మెల్‌బోర్న్‌కు చెందిన ‘ది ఏజ్’ వార్తాపత్రిక నివేదించింది. కానీ, వీసా దరఖాస్తులో పొరపాటు కారణంగా వారి ప్రవేశం ఆలస్యమవుతోంది.

జకోవిచ్‌కు వైద్యపరమైన మినహాయింపుపైనా వివాదం..
ఇప్పటికీ సరిహద్దు దాటలేకపోయాడని స్థానిక మీడియా రెండు గంటల తర్వాత నివేదించింది. అతనికి ఇచ్చిన మెడికల్ మినహాయింపుపై కూడా మిశ్రమ స్పందన ఉంది. ఇందులో తొమ్మిది సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్‌కు ఏ ప్రాతిపదికన మెడికల్ మినహాయింపు ఇచ్చారనే వివాదం తలెత్తింది. దీంతో, టోర్నమెంట్‌లో కఠినమైన కరోనా వ్యాక్సినేషన్ ప్రోటోకాల్ కారణంగా అతను ఆడటంపై అనుమాలు వినిపిస్తున్నాయి.

ఇందుకు మినహాయింపుగా ఆస్ట్రేలియా వెళ్లేందుకు అనుమతి లభించిందని మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. మెల్‌బోర్న్‌కు వెళ్లాల్సిన అవసరం ఉన్నప్పటికీ, అతను కరోనావైరస్‌కు వ్యతిరేకంగా టీకాలు వేసుకున్నాడో లేదో చెప్పడానికి జకోవిచ్ నిరాకరించాడు. విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం రెండవ డోస్ కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న ఆటగాళ్లు, సిబ్బంది, అభిమానులకు మాత్రమే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ప్రవేశాన్ని అనుమతించింది.

ప్రకటన విడుదల చేసిన ABF..
ఆస్ట్రేలియన్ బోర్డర్ ఫోర్స్ గురువారం మాట్లాడుతూ, ‘జొకోవిచ్ ఆస్ట్రేలియాలో ప్రవేశించడానికి అవసరమైన పత్రాలను సమర్పించలేకపోయాడు. దీని కారణంగా అతని వీసా రద్దు చేశాం. ఆస్ట్రేలియాలో పౌరసత్వం లేని వ్యక్తులు, వారి వీసా రద్దు చేసిన వారు తమ దేశానికి తిరిగి పంపిస్తాం. దీనిపై జకోవిచ్ తరపు న్యాయవాదులు కోర్టులో అప్పీలు చేస్తున్నారు. ప్రస్తుతానికి జకోవిచ్‌ని మెల్‌బోర్న్‌లోని ఓ హోటల్‌లో ఉన్నారని’ ప్రకటించింది.

Also Read: PKL 2021: విజయం కోసం తెలుగు టైటాన్స్ ఎదురుచూపులు.. ఆరింట్లో ఒక్క మ్యాచ్ గెలవలే.. అగ్రస్థానంలో ఎరున్నారంటే?

3 బంతులు ఆడిన తర్వాత వెళ్లిపోమన్నారు.. నువ్వు పనికిరావన్నారు.. కానీ ఇండియన్ కెప్టెన్‌గా 3 వరల్డ్‌ కప్‌లకి నాయకత్వం వహించాడు..?