Andy Murray Retirement Plans: టెన్నిస్ నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత ఆండీ ముర్రే ఎలా ఉండాలనుకుంటున్నాడు? ఈ ప్రశ్నకు సమాధానం దొరికేసింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ముర్రే.. రిటైర్మెంట్ తర్వాత తాను ఓ ప్రొఫెషనల్ గోల్ఫ్ కేడీ లేదా ఫుట్‌బాల్ కోచ్ అవుతానని చెప్పుకొచ్చాడు. మూడు గ్రాండ్‌స్లామ్‌లను గెలుచుకున్న మాజీ ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు తన కలను నిజం చేసుకున్నాడు.
ముర్రే గాయం కారణంగా చాలాకాలం కోర్టుకు దూరమయ్యాడు. క్రమంగా, అతని ర్యాంక్ కూడా పడిపోయింది. మియామీ ఓపెన్ నుంచి తన పేరును తొలగించిన ఈ స్టార్ ప్లేయర్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. “నేను గోల్ఫ్‌ను ప్రేమిస్తున్నాను. గోల్ఫ్ టూర్లలో క్యాడీగా ఉండగలిగితే, అంతకన్నా గొప్పది మరొకటి ఉండదు. ఇక ఈ టూర్ల ద్వారా మీరు ఉత్తమ గోల్ఫ్ క్రీడాకారులను చూసే అవకాశం ఉంటుంది. నేను వారి నుండి ఈ ఆటను నేర్చుకోగలను.’
మీరు గోల్ఫ్ క్యాడీగా ఎందుకు ఉండాలనుకుంటున్నారు? ఈ ప్రశ్నకు ఆండ్రీ ముర్రే స్పందించాడు, ‘యోగా టెన్నిస్, గోల్ఫ్‌కు చాలా దగ్గరగా ఉంటుంది. చాలామంది టెన్నిస్ నుండి గోల్ఫ్ క్రీడాకారులు అయ్యారు. అలా కాకుండా, నేను గోల్ఫ్ క్రీడాకారుడికి మానసికంగా సహాయపడగలిగితే అది చాలా బాగుంటుంది.’ అని అన్నాడు.
Also Read:
చనిపోయినట్లుగా ‘ముంగూస్’ చిలిపి డ్రామాలు.. వైరల్ వీడియో.. చివరికి అదిరిపోయే ట్విస్ట్ .!
తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు అలెర్ట్.. పలు రైళ్ల సమయాల్లో మార్పులు.. వివరాలు ఇవే.!
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్.. ట్విట్టర్ వేదికగా ప్రకటన.!