Wrestler Sushil Kumar: యువ రెజ్లర్ సాగర్ రాణాపై సుశీల్ కుమార్ కర్రతో దాడి.. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో..!

ఒలింపిక్ ఛాంపియన్ సుశీల్ కుమార్.. యువ రెజ్లర్ సాగర్‌ రాణాపై కర్రతో దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Wrestler Sushil Kumar: యువ రెజ్లర్ సాగర్ రాణాపై సుశీల్ కుమార్ కర్రతో దాడి.. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో..!
Sushil Kumar

Updated on: May 28, 2021 | 2:38 PM

Wrestler Sushil Kumar Attacking Video Viral: ఒలింపిక్ ఛాంపియన్ సుశీల్ కుమార్.. యువ రెజ్లర్ సాగర్‌ రాణాపై కర్రతో దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 23 ఏళ్ల సాగర్ రాణాను హత్యకు పాల్పడిన కేసులో ఒలింపిక్ పతకాల విజేత సుశీల్ కుమార్ ఢిల్లీ పోలీసుల అదుపులో ఉండగా ఆయన దాడి చేసిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. గురువారం రాత్రి నుంచి ఇందుకు సంబంధించిన వీడియో హిందీ, ఇంగ్లీషు భాషల్లో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

సుశీల్‌తో పాటు అతని సహచరులు బాధితుడిని కర్రలతో కొట్టడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. మే 4 వతేదీ రాత్రి సుశీల తన సహచరులతో కలిసి సాగర్ రాణాను కిడ్నాప్ చేసి ఛత్రసాల్ స్టేడియానికి తీసుకువచ్చినట్లు విజువల్స్ ఉన్నాయని సమాచారం. అనంతరం సాగర్ పై సుశీల్ దాడి చేయడం వల్లే మరణించాడని తేలింది. తప్పని నుంచి తప్పించుకుని పారిపోయిన సుశీల్‌పై లక్ష రూపాయల రివార్డును కూడా ప్రకటించారు ఢిల్లీ పోలీసులు. రెండు వారాల తర్వాత ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుశీల్ కుమార్‌తో పాటు అతని నలుగురు స్నేహితులు భూపేందర్, మోహిత్, గులాబ్, మంజీత్‌లను కూడా పోలీసులు అరెస్టు చేశారు.



Read Also….  Brahmamgari Matam: కొత్త వివాదంలో బ్రహ్మంగారి మఠం.. పీఠాధిపతి కోసం వారసుల మధ్య వైరం..!