స్లెడ్జింగ్‌ చేస్తే ఊరుకునేది లేదంటున్న ఆసీస్‌ చీఫ్‌ కోచ్‌ లాంగర్‌!

No room for abuse : స్లెడ్జింగ్‌కు పర్యాయపదమే ఆస్ట్రేలియా క్రికెట్‌! ప్రత్యర్థి ఆటగాళ్లను చులకన చేసి మాట్లాడటం, వారిని దూషిస్తూ ఏకాగ్రతను దెబ్బతీయడంలో ఆసీస్‌ ఆటగాళ్లు కొట్టిన పిండి..

స్లెడ్జింగ్‌ చేస్తే ఊరుకునేది లేదంటున్న ఆసీస్‌ చీఫ్‌ కోచ్‌ లాంగర్‌!
Follow us
Balu

|

Updated on: Nov 25, 2020 | 12:47 PM

No room for abuse : స్లెడ్జింగ్‌కు పర్యాయపదమే ఆస్ట్రేలియా క్రికెట్‌! ప్రత్యర్థి ఆటగాళ్లను చులకన చేసి మాట్లాడటం, వారిని దూషిస్తూ ఏకాగ్రతను దెబ్బతీయడంలో ఆసీస్‌ ఆటగాళ్లు కొట్టిన పిండి.. అయితే రెండేళ్లుగా వారిలోనూ మార్పు వచ్చింది. ఇప్పుడు కాస్త కామ్‌ అయ్యారు.. దక్షిణాఫ్రికాలో బాల్‌ టాంపరింగ్‌ వివాదం తర్వాత ఆసీస్‌ ఆటగాళ్లు దూకుడు తగ్గించారు.. ఇకపై ఆసీస్‌ ఆటగాళ్లు స్లెడ్జింగ్‌కు పాల్పడరంటూ ఆస్ట్రేలియా హెడ్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ కూడా అంటున్నారు. గత రెండేళ్లుగా ఆసీస్‌ టీమ్‌లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో అందరికీ తెలిసిన విషయమేనని, గ్రౌండ్‌లోనూ, గ్రౌండ్‌ వెలుపలా తమ ఆటగాళ్ల ప్రవర్తన ఎలా ఉందో కూడా గమనించే ఉంటారని లాంగర్‌ అన్నాడు. ఇప్పుడు సరదా సంభాషణలకు, పరిహాసాలకు చోటు ఉంటుందేమో కానీ తిట్లు మాత్రం ఉండవని చెబుతున్నాడు.. ఒకవేళ ఎవరైనా అలా అసభ్యకరమైన తిట్లు తిడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పాడు. స్లెడ్జింగ్‌ పేరుతో హద్దులు దాటితే ఊరుకునే ప్రసక్తి ఉండదని స్పష్టం చేశాడు. క్రితంసారి అంటే 2018-19 నాటి ఆసీస్‌ టూర్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పెన్‌ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ సంఘటనను ప్రస్తావిస్తూ కోహ్లీ వ్యవహారశైలిని తాము ఇష్టపడతామని, ఆనాటి ఘటనను సరదాగా తీసుకోవాలని అన్నాడు లాంగర్‌. ఇప్పుడున్న ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా క్రికెట్‌ ఆస్ట్రేలియాకు టీమిండియా టూర్‌ ఎంతో అవసరమన్నాడు.