Sourav Ganguly: సీఎం పదవి ఇస్తామంటే రాజకీయాల్లోకి వస్తారా..? సౌరవ్ గంగూలీ ఏమన్నారంటే..

వచ్చే ఏడాదే పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయ్‌. దాంతో, ఇప్పట్నుంచే రాజకీయ సమీరణాలు శరవేగంగా మారిపోతున్నాయ్‌. ఈ క్రమంలో సీఎం పదవి ఇస్తామంటే సౌరవ్‌ గంగూలీ.. పొలిటికల్‌ ఎంట్రీ ఖాయమా?. రాజకీయాల్లోకి రావడంపై అసలు గంగూలీ మనసులో మాటేంటి?.. ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి..

Sourav Ganguly: సీఎం పదవి ఇస్తామంటే రాజకీయాల్లోకి వస్తారా..? సౌరవ్ గంగూలీ ఏమన్నారంటే..
Sourav Ganguly

Updated on: Jun 23, 2025 | 9:00 AM

వచ్చే ఏడాదే పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయ్‌. దాంతో, ఇప్పట్నుంచే రాజకీయ సమీరణాలు శరవేగంగా మారిపోతున్నాయ్‌. అధికారమే లక్ష్యంగా బలం, బలగాన్ని పెంచుకునేందుకు పావులు కదుపుతున్నాయ్‌ ప్రధాన పార్టీలు. ఇదే సమయంలో బీసీసీఐ మాజీ చీఫ్‌, మాజీ క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. వచ్చే ఏడాది బెంగాల్‌ ఎన్నికలు జరగనున్నవేళ.. పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తారా అనే చర్చ జరుగుతోంది. ఇదే ప్రశ్నను సౌరవ్‌ గంగూలీకి సంధించింది పీటీఐ పాడ్‌కాస్ట్‌. ఏదైనా రాజకీయ పార్టీలో చేరాలనుకుంటున్నారా అంటూ గంగూలీని అడిగింది. అయితే, పొలిటికల్‌ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు సౌరవ్‌ గంగూలీ. గతంలో చెప్పిన సమాధానాన్నే రిపీట్‌ చేశారు దాదా. రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని మరోసారి తేల్చిచెప్పారు.

ఒకవేళ ముఖ్యమంత్రి పదవి ఇస్తామని హామీ ఇస్తే.. రాజకీయాల్లోకి వస్తారా? అంటూ మరో ప్రశ్న సంధించంగా.. తనకు ఆసక్తి లేదంటూ చిరునవ్వుతో సమాధానం చెప్పారు గంగూలీ. పొలిటికల్‌ ఎంట్రీపై ఎలా తిప్పితిప్పి అడిగినా.. ఆసక్తి లేదన్న సమాధానమే గంగూలీ నుంచి వచ్చింది. సీఎం పదవి ఇస్తామన్నా కూడా రాజకీయాల్లోకి రానని చెప్పేశారు సౌరవ్‌ గంగూలీ..

కోచ్ పదవి.. గంభీర్ గురించి గంగూలీ ఏమన్నారంటే..

ఇక, క్రికెట్‌కి సంబంధించిన ప్రశ్నలకు కూడా ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు దాదా. టీమిండియాకి కోచ్‌గా పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారు. అయితే, ప్రస్తుత కోచ్‌ గౌతం గంభీర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. గంభీర్‌ తన సీనియర్ల పట్ల ఎంతో గౌరవంతో ఉండేవాడని గుర్తుచేసుకున్నారు. తాను గంభీర్‌తో కలిసి ఆడానని, అతడు తన సీనియర్ల పట్ల గౌరవంతో నడుచుకునేవాడని ప్రశంసించారు. గంభీర్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది మాత్రమే అవుతుందని.. మరింత ఎదగడానికి, నేర్చుకోవడానికి కొంత సమయం ఇవ్వాలన్నారు గంగూలీ. ప్రస్తుతం తన వయసు 53ఏళ్లన్న గంగూలీ.. మున్ముందు ఏం జరుగుతుందో.. ప్రయాణం ఎక్కడివరకూ వెళ్తుందో చూద్దాం.. దేనికైనా తాను సిద్ధంగానే ఉన్నానంటూ గంగూలీ చెప్పుకొచ్చారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..