హైదరాబద్‌లో న్యూస్9 కార్పొరేట్‌ బ్యాట్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ 2025 పోటీలు..! ఎప్పట్నుంచంటే..

News9 Corporate Badminton Championship 2025: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ వేదికగా మూడు రోజుల పాటు న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2025 ప్రోగ్రామ్ హైదరాబాద్ లో జరగనుంది. కార్పొరేట్ ఉద్యోగులు ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు. పూర్తి వివరాలు ఈకింద చెక్ చేసుకోండి..

హైదరాబద్‌లో న్యూస్9 కార్పొరేట్‌ బ్యాట్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ 2025 పోటీలు..! ఎప్పట్నుంచంటే..
News9 Corporate Badminton Championship 2025

Updated on: May 05, 2025 | 6:26 PM

న్యూస్9 ఆధ్వర్యంలో ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్సెస్ పేరిట దేశవ్యాప్తంగా 12 నుంచి 14, 15 నుంచి 17 ఏళ్ల బాలబాలకలకు గతేడాది ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్‌బాల్ టాలెంట్ హంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశంలోని ప్రతిభావంతులైన యువతకు ఆస్ట్రియా, జర్మనీలోని యూరోపియన్ కోచ్‌లతో శిక్షణ ఇవ్వడం కోసం ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎంపిక చేసి, ఉజ్వల భవిష్యత్తుకు ప్రాణం పోశారు. ఈ అద్భుత కార్పొరేట్‌ ఫుట్‌బాల్‌ కార్యక్రమం తర్వాత టీవీ9 నెట్‌వర్క్ మరో క్రీడా ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించడానికి సిద్ధమైంది. అదే న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2025. పద్మశ్రీ గ్రహీత పుల్లెల గోపీచంద్ సహకారంతో మూడు రోజుల పాటు ఈ క్రీడా మహోత్సవాన్ని నిర్వహించనుంది. న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ అనేది కేవలం ఒక క్రీడా టోర్నమెంట్ మాత్రమేకాదు. ఇది పెరుగుతున్న కార్పొరేట్ సవాళ్లను ఎదుర్కోవడంలోనూ తోడ్పాటును అందిస్తుంది. తమ సంస్థల బ్రాండ్ విలువలను ప్రదర్శించడానికి, క్రీడల ద్వారా నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి, దేశంలోని అగ్ర సంస్థలతో నెట్‌వర్క్‌ను ఏర్పరచుకోవడానికి ఇది మంచి అవకాశం. ఈ ఛాంపియన్‌షిప్‌.. దేశంలోని ప్రముఖ సంస్థల ఉద్యోగులు తమను తాము రీఛార్జ్ చేసుకోవడానికి ఒక ప్రత్యేక వేదికగా మారనుంది.

ఎక్కడ జరుగుతుందంటే..?

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ వేదికగా మే 9 నుంచి 11 వరకు నిర్వహించనున్న ఈ టోర్నమెంట్ జరగనుంది. సైనా నెహ్వాల్, పీవీ సింధు, సాయి ప్రణీత్, పారుపల్లి కశ్యప్, శ్రీకాంత్ కిదాంబి వంటి పలువురు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారులను తయారు చేసిన పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ వంటి వేదికపై ఆడటం, అందులో పాల్గొనడం మరువలేని అనుభూతిని కలిగిస్తుంది. భారతీయ క్రీడా రంగంలో క్రమశిక్షణ, అంకితభావం, శ్రేష్ఠతకు చిహ్నంగా భావించే పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ

ఇందులో ఎవరెవరు పాల్గొనవచ్చు..?

దేశ వ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి సంస్థలు డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, E&Y, టైమ్స్ ఆఫ్ ఇండియా, బ్రాడ్‌రిడ్జ్, క్యాప్‌జెమిని, జెన్ ప్యాక్ట్, ఫిన్‌ఎంకెటి, SPA సాఫ్ట్‌వేర్, యాక్సెంచర్, స్క్రాడింజర్, మెడికవర్ హాస్పిటల్స్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, గార్డియన్ సెక్యూరిటీస్, హై రేడియస్, ఆర్సీసియం, వెల్స్ ఫార్గో, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్, ఆర్సీసియం, ఓల్గా టెక్నాలజీస్, ADP, గ్రోత్ స్టోరీస్, డాక్టర్ కేర్ వంటి కార్పొరేట్‌ సంస్థలు ఇప్పటికే TV9 కార్పొరేట్ ఉద్యమంలో చేరాయి. బలమైన, ఆరోగ్యకరమైన కార్పొరేట్ భారతదేశం కోసం న్యూస్ 9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2025 నిర్వహిస్తుంది. దీని ద్వారా అగ్రశ్రేణి సంస్థలు తమ వర్క్‌ కల్చర్‌ పునర్నిర్వచించుకోవడానికి లభించిన ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని

ఇవి కూడా చదవండి

ఏయే పోటీలు జరుగుతాయి? విన్నర్‌ ఫ్రైజ్‌ ఏం ఇస్తారు?

వర్కింగ్ ప్రొఫెషనల్స్‌, కార్పొరేట్ ఉద్యోగులు, బిజినెస్‌ లీడర్స్, HR నిపుణులు ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు. అయితే తాము పనిచేసే కార్పొరేట్‌ సంస్థ ఏర్పాటే కనీసం 2 సంవత్సరాలు పూర్తై ఉండాలి. మెన్‌ సింగిల్‌, విమెన్‌ సింగిల్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌.. బ్యాట్మింటన్‌ పోటీలు జరుగుతాయి. ఇందులో పాల్గొనే వారికి నిపుణులతో 2 రోజుల కోచింగ్‌ సెషన్‌ కూడా ఉంటుంది. ఫస్ట్ ఫ్రైజర్‌కి రూ.లక్ష 50 వేలు, సెకండ్ ఫ్రైజర్‌కి రూ.లక్ష, థార్డ్‌ ప్రైజర్‌కి రూ. 50 వేలు చొప్పున బహుమతి ప్రధానం చేస్తారు.

ఎలా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి?

ఆసక్తి కలిగిన వారు www.news9corporatecup.com వెబ్‌సైట్‌ నుంచి లేదా corporatecup@tv9.comకు మెయిల్‌ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇతర వివరాలకు.. 9848078649 లేదా 9899102170కి కాల్ చేయవచ్చు.

ఇతర పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని స్పోర్ట్స్‌ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.