News9 CBC 2025: కొనసాగుతోన్న న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్-2025.. రెండో రోజు హైలెట్స్..

భారతదేశంలోని నెంబర్‌వన్ న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో.. న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2025 కొనసాగుతోంది.. హైదరాబాద్‌లోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరుగుతన్న పోటీల్లో దేశ వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ ఉద్యోగులు పాల్గొని సత్తా చాటుతున్నారు. బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ ఆధ్వర్యంలో జరుగుతున్న న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2025 పోటీలు శనివారం రెండోరోజు కొనసాగుతున్నాయి..

News9 CBC 2025: కొనసాగుతోన్న న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్-2025.. రెండో రోజు హైలెట్స్..
Barun Das, MD & CEO of TV9 Network

Updated on: May 10, 2025 | 7:14 PM

భారతదేశంలోని నెంబర్‌వన్ న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో.. న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2025 కొనసాగుతోంది.. హైదరాబాద్‌లోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరుగుతన్న పోటీల్లో దేశ వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ ఉద్యోగులు పాల్గొని సత్తా చాటుతున్నారు. బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ ఆధ్వర్యంలో జరుగుతున్న న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2025 పోటీలు శనివారం రెండోరోజు కొనసాగుతున్నాయి..

శుక్రవారం న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్-2025ని టీవీ9 నెట్‌వర్క్‌ ఎండీ బరుణ్ దాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టీవీ9 COO విక్రమ్‌, టీవీ9 తెలుగు మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌ హాజరయ్యారు. మూడు రోజుల పాటు బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ జరగనుంది. 64 టీమ్స్‌ పాల్గొంటున్నాయి.

మ్యాచ్ షెడ్యూల్.. గెలిచిన జట్లు.. పూర్తి వివరాల కోసం ఈ లింకును క్లిక్ చేయండి..

ప్రస్తుతం దేశంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ.. ప్రధాని మోదీ నాయకత్వంలో మనం విజయం సాధిస్తామన్న నమ్మకం ఉందన్నారు టీవీ9 ఎండీ బరుణ్ దాస్‌.. ఉగ్రవాదాన్ని అణచివేయాల్సిందేనని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ తో మన సత్తా ఏంటో ఇప్పటికే చూపెట్టామన్నారు. ఈ కష్ట సమయంలో భద్రతా బలగాలకు మనం అండగా ఉండాల్సిన అవసరం ఉందని పద్మభూషణ్‌ పుల్లెల గోపిచంద్‌ పేర్కొన్నారు. ఆపరేషన్‌ సింధూర్‌ను విజయవంతం చేసిన త్రివిధ దళాలకు సెల్యూట్‌ చేశారు క్రీడాకారులు. భారత్‌ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

హైదరాబాద్‌లోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శుక్రవారం ప్రారంభమైన న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2025 పోటీలు ఆదివారం వరకు జరగనున్నాయి.