క్రీడాకారులను వదలని కరోనా మహమ్మారి.. 8 మంది బాస్కెట్‌బాల్ ఫ్లేయర్లకు పాజిటివ్.. ఐసోలేషన్ లో ఉండాలన్న ఎన్‌బీఏ

|

Dec 11, 2020 | 8:17 AM

అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యంగా ఉన్నా.. కరోనా మహమ్మారి మాత్రం వదలడంలేదు. తాజాగా తమ క్రీడాకారులకు కరోనా వైరస్ సోకిందంటూ నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రకటించింది.

క్రీడాకారులను వదలని కరోనా మహమ్మారి.. 8 మంది బాస్కెట్‌బాల్ ఫ్లేయర్లకు పాజిటివ్..  ఐసోలేషన్ లో ఉండాలన్న ఎన్‌బీఏ
Follow us on

అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యంగా ఉన్నా.. కరోనా మహమ్మారి మాత్రం వదలడంలేదు. తాజాగా తమ క్రీడాకారులకు కరోనా వైరస్ సోకిందంటూ నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రకటించింది. తాజాగా జరిపిన పరీక్షల్లో 8 మంది క్రీడాకారులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ వెల్లడించింది. డిసెంబరు 2వ తేదీ నుంచి 541 మంది బాస్కెట్ బాల్ క్రీడాకారులకు కొవిడ్-19 పరీక్షలు నిర్వహించగా, వారిలో 8మందికి కొవిడ్ పాజిటివ్ అని తేలిందని ఎన్‌బీఐ స్పోర్ట్స్ గవర్నింగ్ బాడీ తెలిపింది. నవంబరు 24 నుంచి డిసెంబరు 1వతేదీ వరకు జరిపిన పరీక్షల్లో 48 మంది క్రీడాకారులకు కరోనా పాజిటివ్ అని వచ్చింది. కరోనా పాజిటివ్ అని వచ్చిన క్రీడాకారులు కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం ఐసోలేషన్ లో ఉండాలని అసోసియేషన్ సూచించింది. వీరికి కాల్సిన అన్ని రకాల వైద్యసదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొంది.