భారత్ – ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లకు షెడ్యూల్ వచ్చేసింది…సుమారు 4 ఏళ్ల తర్వాత భారత్‌కు వస్తున్న ఇంగ్లాండ్

భారత్ - ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లకు షెడ్యూల్ వచ్చేసింది. దీనితోపాటు వేదికలు కూడా ఖరారయ్యాయి. ఇదే విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జైషా ధృవీకరించారు.

భారత్ - ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లకు షెడ్యూల్ వచ్చేసింది...సుమారు 4 ఏళ్ల తర్వాత భారత్‌కు వస్తున్న ఇంగ్లాండ్
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 11, 2020 | 5:36 AM

భారత్ – ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లకు షెడ్యూల్ వచ్చేసింది. దీనితోపాటు వేదికలు కూడా ఖరారయ్యాయి. ఇదే విషయాన్ని బీసీసీఐ ధృవీకరించింది. భారత్ – ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన ప్రారంభం అవుతుందని తెలిపింది. అదే సమయంలో ఈ సిరీస్‌లో డే-నైట్ టెస్ట్ మ్యాచ్ కూడా జరుగుతుందని స్పష్టం చేసింది. అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 24 నుంచి 28వ తేదీ వరకు భారత్ – ఇంగ్లాండ్ దేశాల మధ్య డే నైట్ టెస్టు మ్యాచ్‌ జరుగుతుందని పేర్కొంది.

కోవిడ్ వ్యాప్తి కారణంగా భారత్- ఇంగ్లాండ్ సిరీస్‌ యూఏఈకి తరలిపోతుందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ జైషా క్లారిటీ ఇచ్చారు. రెండు దేశాల మధ్య సిరీస్‌ భారత్‌లోనే జరుగుతుందని తద్వారా ఈ సిరీస్ బయట దేశానికి తరలి వెళ్లిపోతుందనే వార్తలను కొట్టి పారేశారు.

కోవిడ్ కారణంగా భారత్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లు నిలిచిపోయాయి. ఇక చాలా రోజుల తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ తిరిగి భారత్‌లో జరుగుతుండటంతో క్రికెట్ ప్రియులు అంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఇక భారత్ ఇంగ్లాండ్ దేశాల మధ్య డే – నైట్ టెస్ట్ మ్యాచ్ మొతేరాలోని కొత్త క్రికెట్ స్టేడియంలో జరుగనుంది. అంతేకాదు టీట్వంటీ సిరీస్ మొత్తం కొత్తగా నిర్మించిన మొతేరా క్రికెట్ స్టేడియంలోనే జరుగుతుంది. మొత్తం 5 టీ20 మ్యాచ్‌లు ఈ కొత్త స్టేడియంలో జరుగుతాయి.

ఈ సిరీస్‌లో భాగంగా ఐదు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఇరు దేశాల మధ్య జరగనున్నాయి. 2016 తర్వాత ఇంగ్లాండ్ భారత్‌ పర్యటనకు వస్తోంది. 2018 తర్వాత రెండు దేశాల మధ్య సిరీస్ జరగడం కూడా ఇదే తొలిసారి అవుతుంది.

భారత్ – ఇంగ్లాండ్ టెస్ట్ షెడ్యూల్:

తొలి టెస్టు : చెన్నైలో ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 9 వరకు

రెండో టెస్టు: చెన్నైలో ఫిబ్రవరి 13 నుంచి ఫిబ్రవరి 17వరకు

మూడోటెస్టు (డే/నైట్) : అహ్మదాబాదులో ఫిబ్రవరి 24 నుంచి ఫిబ్రవరి 28 వరకు

నాల్గవ టెస్టు: అహ్మదాబాదులో 4 మార్చి నుంచి 8మార్చి వరకు

భారత్ – ఇంగ్లాండ్ T20 మ్యాచ్ షెడ్యూల్ :

అహ్మదాబాద్  : తొలి టీట్వంటీ 12 మార్చి

అహ్మదాబాద్ : రెండో టీట్వంటీ 14 మార్చి

అహ్మదాబాద్  :   మూడో టీట్వంటీ  16 మార్చి

అహ్మదాబాద్  : నాల్గవ టీట్వంటీ: 18 మార్చి

అహ్మదాబాద్  : ఐదవ టీట్వంటీ: 20 మార్చి

భారత్ – ఇంగ్లాండ్ వన్డే షెడ్యూల్:

తొలి వన్డే:  23 మార్చి పూణేలో

రెండో వన్డే: 26 మార్చి పూణేలో

మూడో వన్డే: 28 మార్చి పూణేలో

ఇప్పటికే వన్డే మ్యాచులు టీట్వంటీ సిరీస్‌లు ముగియగా… ఈ నెల 17వ తేదీ నుంచి భారత్ ఆస్ట్రేలియాల మధ్య తొలిటెస్టు ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా వన్డే సిరీస్ గెలువగా భారత్ టీట్వంటీ సిరీస్‌ కైవసం చేసుకుంది.