క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాసైన రోహిత్ శర్మ.. ఆసీస్ ఫ్లైట్ ఎక్కనున్న హిట్‌మ్యాన్..
భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనకు లైన్ క్లియర్ అయింది. ఇవాళ బెంగళూరులోని జాతీయ క్రికెట్..
India Vs Australia 2020: భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనకు లైన్ క్లియర్ అయింది. ఇవాళ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో అతడికి రెండోసారి ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించగా.. దాన్ని హిట్‌మ్యాన్ అధిగమించాడు. దీనితో అతడు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమని ఫిజియోలు తేల్చి చెప్పారు.
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ డిసెంబర్ 14న ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కనున్నాడు. అక్కడ 14 రోజుల క్వారంటైన్‌ను పూర్తి చేసుకుని జనవరిలో జరగబోయే చివరి రెండు టెస్టులకు జట్టుకు అందుబాటులో ఉంటాడు. కాగా, ఐపీఎల్ అనంతరం రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో భారత్ జట్టుతో కలవకుండా పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు నవంబర్ 19న ఎన్‌సీఏ చేరుకున్న సంగతి తెలిసిందే.
Also Read: రైల్వే ప్రయాణీకులకు ముఖ్య గమనిక.. పలు స్పెషల్ ట్రైన్స్ సమయాల్లో మార్పు.. కీలక సమాచారం ఇదే..