Wrestlers Protest: రెజ్లర్ల ధర్నాకు పెరుగుతున్న మద్దతు.. బ్రిజ్‌భూషణ్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదని పశ్నించిన సిద్ధూ..

|

May 02, 2023 | 6:58 AM

ఢిల్లీలో ఆందోళన చేస్తున్న మహిళా రెజ్లర్లకు మాజీ క్రికెటర్‌ , కాంగ్రెస్‌ నేత నవజ్యోత్‌సింగ్‌ మద్దతు ప్రకటించారు. జంతర్‌మంతర్‌లో జరుగుతున్న ధర్నాలో సిద్దూ పాల్గొన్నారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలన్నారు సిద్దూ.

Wrestlers Protest: రెజ్లర్ల ధర్నాకు పెరుగుతున్న మద్దతు.. బ్రిజ్‌భూషణ్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదని పశ్నించిన సిద్ధూ..
Wrestlers Protest
Follow us on

ఢిల్లీలో ధర్నా చేస్తున్న రెజ్లర్లకు సిద్దూ కూడా మద్దతు ప్రకటించారు. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని సిద్దూ ప్రశ్నించారు. అయితే రెజ్లర్ల ఆందోళన వెనుక విపక్షాల కుట్ర ఉందని , తాను పిలుపునిస్తే జంతర్‌మంతర్‌కు వేలాదిమంది తరలివస్తారని అంటున్నారు బ్రిజ్‌భూషణ్‌.

ఢిల్లీలో ఆందోళన చేస్తున్న మహిళా రెజ్లర్లకు మాజీ క్రికెటర్‌ , కాంగ్రెస్‌ నేత నవజ్యోత్‌సింగ్‌ మద్దతు ప్రకటించారు. జంతర్‌మంతర్‌లో జరుగుతున్న ధర్నాలో సిద్దూ పాల్గొన్నారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలన్నారు సిద్దూ. ఇది మహిళల ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటమన్నారు సిద్దూ. సుప్రీంకోర్టు ఆదేశాలతో బ్రిజ్‌భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. జంతర్‌మంతర్‌లో ధర్నా చేస్తున్న ఆరుగురు మహిళా రెజ్లర్లకు ఢిల్లీ పోలీసులు సెక్యూరిటీని కల్పించారు. లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ కు వ్యతిరేకంగా స్టార్‌ రెజ్లర్లు గత 9 రోజులుగా నిరసన చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైంది. అయితే ఆయన రాజీనామా చేయాలని రెజ్లర్లు కోరుతున్నారు. అయితే తనకు వ్యతిరేకంగా తుక్డే తుక్డే గ్యాంగ్‌ కుట్ర చేసిందని అంటున్నారు బ్రిజ్‌భూషణ్‌. ఎవరిని తాను వేధించలేదని స్పష్టం చేశారు. జంతర్‌మంతర్‌లో ఆందోళన చేస్తున్న రెజ్లర్ల వెనుక విపక్ష నేతలు ఉన్నారని ఆరోపించారు.

కుస్తీ యోధులను హర్యానా , ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందినవాళ్లుగా విడదీసే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. బ్రిజ్‌భూషణ్‌ వ్యవహారంలో వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలని మహిళా రెజ్లర్లు డిమాండ్‌ చేస్తున్నారు. రెజ్లర్లకు కాంగ్రెస్‌ నేత ప్రియాంగాగాంధీ , ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు పలువురు విపక్ష నేతల మద్దతు లభించింది. అయితే రెజ్లర్ల ధర్నాను చాలా లైట్‌గా తీసుకుంటున్నారు బ్రిజ్‌భూషణ్‌. తాను పిలుపునిస్తే జంతర్‌మంతర్‌లో క్షణాల మీద వేలాదిమంది జనం తరలివస్తారని అన్నారు. మరోవైపు రెజ్లర్ల ఆరోపణలపై విచారణకు హాజరుకావాలని బ్రిజ్‌భూషణ్‌కు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసుల విచారణకు హాజరవుతానని , అన్ని విషయాలపై స్పష్టతనిస్తానని అన్నారు బ్రిజ్‌భూషణ్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..