కరోనా ఎఫెక్ట్: నేషనల్ గేమ్స్ వాయిదా..

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. కోవిడ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్న విషయం తెలిసిందే. దీని ప్రభావం అన్ని రంగాలపైనా కనిపిస్తుంది. ప్రపంచ ఆర్థి వ్యవస్థను కూడా దెబ్బతీసింది కరోనా. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు...

కరోనా ఎఫెక్ట్: నేషనల్ గేమ్స్ వాయిదా..

Edited By:

Updated on: May 28, 2020 | 8:50 PM

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. కోవిడ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్న విషయం తెలిసిందే. దీని ప్రభావం అన్ని రంగాలపైనా కనిపిస్తుంది. ప్రపంచ ఆర్థి వ్యవస్థను కూడా దెబ్బతీసింది కరోనా. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు లక్ష దాటాయి. దీంతో జాతీయ వ్యాప్తంగా జరగాల్సిన అన్ని రకాల ఆటలను వాయిదా వేసింది జాతీయ ఒలింపిక్ అసోసియేషన్. ఈ ఆటల కారణంగా జనమందరూ ఒకే చోట గుమిగూడాల్సి వస్తుందని.. దాంతో కరోనా వ్యాప్తి ఎక్కువయ్యే ప్రమాదమున్న దృష్ట్యా.. ఈ నేషనల్‌ గేమ్స్‌ని వాయిదా వేశారు. అయితే మళ్లీ క్రీడలను నిర్వహిస్తామని నిర్వాహక కమిటీ నిర్ణయించింది. తేదీలను నిర్ణయించడానికి సెప్టెంబర్‌లో మరలా సమావేశం అవ్వాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కమిటీ వెల్లడించింది.

ఇది కూడా చదవండి:

నోరు అదుపులో ఉంచుకోవాలి.. జారొద్దు.. బాలయ్యపై నాగబాబు ఘాటు వ్యాఖ్యలు

నందమూరి ఫ్యామిలీ నుంచి మల్టీ స్టారర్.. స్టోరీ రెడీ చేస్తోన్న కళ్యాణ్ రామ్?

మహిళలకు కేంద్రం బంపర్ ఆఫర్.. నెలకు రూ.4 వేల జీతం పక్కా!

హోమ్ క్వారంటైన్‌లో జబర్దస్త్ నటుడు

మళ్లీ తెరపైకి ‘ప్రత్యేక హోదా’ అంశం.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు