Team India: మొక్కు తీర్చుకున్న టీమిండియా ప్లేయర్.. సుబ్రహ్మణ్య స్వామికి తలనీలాలు సమర్పణ..

Team India: ఐపీఎల్‌తో తానేంటో నిరూపించుకుని టీమిండియాలో చోటు దక్కించుకున్న యువ క్రికెటర్ టి. నటరాజన్..

Team India: మొక్కు తీర్చుకున్న టీమిండియా ప్లేయర్.. సుబ్రహ్మణ్య స్వామికి తలనీలాలు సమర్పణ..

Updated on: Jan 31, 2021 | 7:17 PM

Team India: ఐపీఎల్‌తో తానేంటో నిరూపించుకుని టీమిండియాలో చోటు దక్కించుకున్న యువ క్రికెటర్ టి. నటరాజన్.. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన అన్ని టీ20, వన్డే, టెస్ట్ మూడు ఫార్మాట్ల మ్యాచ్‌ల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన విషయం తెలిసిందే. లెఫ్టా హ్యాండ్ పేసర్ అయిన నటరాజన్ బౌలింగ్‌తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియా టూర్ విజయవంతం అయిన తరువాత నటరాజన్ తమిళనాడు రాష్ట్రం సేలంలోని స్వగ్రామమైన చిన్నప్పంపట్టికి చేరుకున్నాడు.

అయితే, తాజాగా నటరాజన్ పళనిలోని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నాడు. ఆ సందర్భంగా స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నాడు. గుడిలో తలనీలాలు సమర్పించుకున్నాడు. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అనంతరం నటరాజన్ గుండు మీద దిగిన ఫోటోను ట్వీట్ చేశాడు. కాగా, దైవ దర్శనానికి వచ్చిన నటరాజన్‌ను కలిసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. అతనితో సెల్ఫీలు దిగారు.

Nataraj Tweet:

Also read:

మదనపల్లె జంట హత్యల కేసులో మరో మలుపు.. నిందితుల తరపున వాదించేందుకు ముందుకొచ్చిన సుప్రీం కోర్టు న్యాయవాది

David Warner: ఈసారి చిరు వంతు.. ‘ఆచార్యగా మారిన డేవిడ్‌ వార్నర్‌’… వైరల్‌ అవుతోన్న వీడియో…