Siraj Pays Tribute To Father: ఆస్ట్రేలియా పర్యటనలో పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్‌ను ఓ లీడర్‌గానే కాదు.. పరిణితి చెందిన ఆటగాడిగా అవతరించాడు. చిరస్మరణీ విజయం అందుకుని హైదరాబాద్ చేరుకున్న సిరాజ్.. నేరుగా తన తండ్రి సమాధి వద్దకు వెళ్లి.. నివాళులు అర్పించి.. ప్రార్ధనలు చేశాడు.
భారతదేశం తరపున ఆడాలన్నది తన తండ్రి కల అని.. దానిని నిజం చేసే అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని సిరాజ్ పేర్కొన్నాడు. కాగా, ఆసీస్ పర్యటన మధ్యలో సిరాజ్ తండ్రి మహమ్మద్ గౌస్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలలో పాల్గొనడం కోసం స్వదేశానికి తిరిగి వెళ్ళవచ్చునని బీసీసీఐ సిరాజ్‌కు అవకాశం ఇచ్చినా.. తన తండ్రి కలను నెరవేర్చడం కోసం దుఃఖాన్ని దిగమింగుకుని అక్కడే టీమ్‌తో ఉన్నాడు. జాతివివక్ష విమర్శలు ఎదుర్కున్నాడు. అయినా వెనకడుగు వేయకుండా.. చివరి రెండు టెస్టుల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి.. టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు.
Also Read:
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఫిబ్రవరి కోటా దర్శన టికెట్లు విడుదల..
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఏపీ డీజీపీ విరాళం.. ఎంత ఇచ్చారంటే..!