Mohammed Siraj: అరుదైన రికార్డు సాధించిన హైదరాబాదీ.. సిరాజ్‌కు సలాం కొడుతోన్న నెటిజన్లు..

Mohammed Siraj: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో హైదరాబాద్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ అదరగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో....

Mohammed Siraj: అరుదైన రికార్డు సాధించిన హైదరాబాదీ.. సిరాజ్‌కు సలాం కొడుతోన్న నెటిజన్లు..

Updated on: Jan 18, 2021 | 3:22 PM

Mohammed Siraj: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో హైదరాబాద్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ అదరగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో లబూషేన్, స్మిత్, వేడ్, స్టార్క్, హెజిల్‌వుడ్‌లను ఔట్ చేయడంతో మొత్తంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. దీనితో పలు రికార్డులను సిరాజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి టెస్టు సిరీస్‌లో ఐదు వికెట్లు సాధించిన ఘనతతో పాటు గబ్బాలో ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించిన ఐదో ఇండియన్ బౌలర్‌గా సిరాజ్ రికార్డు సృష్టించాడు. ఎరాప‌ల్లి ప్ర‌స‌న్న‌, బిష‌న్ సింగ్ బేడీ, మ‌ద‌న్ లాల్‌, జ‌హీర్ ఖాన్‌లు సిరాజ్ కంటే ముందు వరుసలో ఉన్నారు.

కాగా, సిరాజ్ అత్యుత్తమ ప్రదర్శనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తండ్రిని కోల్పోయినా.. ఆస్ట్రేలియాలో జట్టుతోనే ఉన్నాడు. జాతివివక్ష విమర్శలు ఎదుర్కున్నాడు. అయినా వాటిని కూడా పట్టించుకోలేదు. సీనియర్ల గైర్హాజరీలో.. బౌలింగ్ యూనిట్‌కు సారధ్యం వహించి.. కెరీర్‌లో ఆడుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌కు చమటలు పట్టించు ఐదు వికెట్లు పడగొట్టాడని సిరాజ్‌ను నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.