భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. ఏకంగా సిరీస్‌ నుండే తప్పుకున్న ఫాస్ట్ బౌలర్ స్టార్క్..

భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో ఓటమి పాలైన ఆసిస్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆసిస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్..

భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. ఏకంగా సిరీస్‌ నుండే తప్పుకున్న ఫాస్ట్ బౌలర్ స్టార్క్..

Updated on: Dec 06, 2020 | 12:26 PM

భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌ల‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో ఓటమి పాలైన ఆసిస్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆసిస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ టీ20 సిరీస్‌ నుండి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని జట్టు చీఫ్ కోచ్ జస్టిన్ లాంగర్ వెల్లడించాడు. మిచెల్ కుటుంబంలో ఒకరు తీవ్ర అనారోగ్యానికి గురి కావడం వల్లే అతను ఈ సిరీస్‌కు దూరం అవుతున్నట్లు లాంగర్ తెలిపారు. అయితే మిచెల్ నిర్ణయంపై లాంగర్ సానుకూలంగా స్పందించారు. ‘ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికైనా తన కుటుంబాన్ని మించింది లేదు. మిచెల్ స్టార్క్‌కు కూడా ఇందులో ఎలాంటి మినహాయింపు లేదు. జట్టులోకి తిరిగి వచ్చేందుకు కావాల్సినంత సమయాన్ని అతనికి ఇస్తాం. ఇబ్బందులన్నీ తొలిగిపోయాక మిచెల్ తిరిగి జట్టులోకి రావొచ్చు’ అని లాంగర్ పేర్కొన్నాడు. కాగా, మిచెల్ స్టార్క్ ఆసిస్ జట్టులో కీలక బౌలర్‌గా గుర్తింపు పొందాడు. గత శుక్రవారం కాన్‌బెర్రా వేదికగా భారత్‌తో జరిగిన తొలి టీ20లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన మిచెల్ 2/34తో మంచి ఆటతీరును కనబరిచాడు.