Lionel Messi: ఇదేంది ‘మెస్సీ’ మామా.. ఆ సమయంలో కూడా ట్రోపీని వదిలిపెట్టవా?.. వైరల్ అవుతున్న ఫోటో..

ఫిఫా కప్ ను క్షణం కూడా మిస్సవ్వడం లేదు అర్జెంటీనా స్టార్ లియోన‌ల్ మెస్సీ. రీసెంట్ గా మెస్సీ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అవును, ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైనల్ పోరు జరిగి మూడు రోజులు గడిచిన ప్రపంచ వ్యాప్తంగా

Lionel Messi: ఇదేంది ‘మెస్సీ’ మామా.. ఆ సమయంలో కూడా ట్రోపీని వదిలిపెట్టవా?.. వైరల్ అవుతున్న ఫోటో..
Lionel Messi

Updated on: Dec 21, 2022 | 5:02 AM

ఫిఫా కప్ ను క్షణం కూడా మిస్సవ్వడం లేదు అర్జెంటీనా స్టార్ లియోన‌ల్ మెస్సీ. రీసెంట్ గా మెస్సీ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అవును, ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైనల్ పోరు జరిగి మూడు రోజులు గడిచిన ప్రపంచ వ్యాప్తంగా ఆ ఆఫీవర్ ఇంకా అటు ఆటగాళ్లను, ఇటు ఫుట్‌బాల్ ఫ్యాన్స్ వదల్లేదు. అర్జెంటీనా స్టార్ లియోన‌ల్ మెస్సీ త‌న క‌ల నిజం కావ‌డంతో ప‌ట్టలేనంత హ్యాపినెస్‌లో ఉన్నాడు. రీసెంట్ గా వ‌ర‌ల్డ్ క‌ప్ విన్నింగ్ సెల‌బ్రేషన్ వీడియోలు, ఫొటోల్ని సోష‌ల్‌మీడియాలో షేర్ చేశాడు. అభిమానుల‌తో పంచుకున్నాడు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్ కు గుడ్‌మార్నింగ్ చెప్తూ మెస్సీ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

కప్ గెలిచి 48గంటలు దాటిన మెస్సీ మాత్రం ట్రోఫీని వదల్లేదు. తిన్నా, పడుకున్నా.. దానితోనే గడుపుతున్నాడు. కప్ ను తన పక్కనే పెట్టుకొని నిద్రిస్తున్నాడు. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవదులులేకుండా పోయింది. ఫోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే కోట్లలో లైక్ చేశారు.

అటు వరల్డ్‌ కప్‌ని అర్జెంటీనాకి తీసుకెళ్లిన సమయంలోనూ మెస్సీ చేతిలోనే ట్రోఫీ ఉంది. రాజధానిలో ఊరేగుతున్నంత సేపు మెస్సీనే పట్టుకున్నాడు. ఎటు చూసిన వరల్డ్‌ కప్‌ మీద తనకున్న మమకారాన్ని తెలియజేస్తున్నాడు మెస్సీ. అతని సారథ్యంలో దాదాపు 36 ఏళ్ల తర్వాత వరల్డ్‌ కప్‌ రావడంతో అటు మెస్సీ.. అర్జెంటీనా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..