Linoel Messi: ఈ ఒక్క టిష్యూ పేపర్ ఖరీదు అక్షరాల 8 కోట్లు.. అంత స్పెషల్ ఎందుకో తెలుసా?..

|

Dec 21, 2022 | 5:42 AM

ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఫిఫా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో అర్జెంటీనా టీమ్.. ఫ్రాన్స్‌ను ఓడించింది. ఆ జట్టు కెప్టెన్, స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ అదిరిపోయే ఫర్ఫార్మెన్స్‌తో పిచ్చెక్కించాడు.

Linoel Messi: ఈ ఒక్క టిష్యూ పేపర్ ఖరీదు అక్షరాల 8 కోట్లు.. అంత స్పెషల్ ఎందుకో తెలుసా?..
Messi
Follow us on

ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఫిఫా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో అర్జెంటీనా టీమ్.. ఫ్రాన్స్‌ను ఓడించింది. ఆ జట్టు కెప్టెన్, స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ అదిరిపోయే ఫర్ఫార్మెన్స్‌తో పిచ్చెక్కించాడు. అత్యుత్తమ ఫుట్ బాల్ ప్లేయర్‌గా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు మెస్సీ. అతనంటే.. అభిమానులకు ఎనలేని ప్రేమ. మెస్సీ ఏం చేసినా వారికి పండగే. ఇక మెస్సీ కన్నీరు పెట్టుకుంటే.. వారు కూడా కన్నీరు పెట్టుకుంటారు. ఇక మెస్సీకి సంబంధించి ఏదైనా సరే వారికి ఎంతో విలువైనదిగా చెప్పవచ్చు. అందుకే కాబోలు.. మెస్సీ కన్నీటి చుక్కకు కూడా చాలా విలువ కట్టారు అభిమానులు. ఆ కన్నీటిని తుడుచుకున్న టిష్యూకు ఊహించని ధర ఇచ్చేశారు. మ్యాటర్ ఏంటో అర్థం కాట్లేదా? ఇక విషయంలో వెళదాం.

లియోనెల్ మెస్సీ ఆగస్టు 2021లో బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్‌ను వీడి బయటకు వచ్చేశాడు. ఆ సమయంలో మెస్సీ చాలా భావోద్వేగానికి గురయ్యాడు. మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. దాంతో పక్కనే ఉన్న అతని భార్య.. టిష్యూ ఇచ్చింది. ఆ టిష్యూతో మెస్సీ తన కన్నీటిని తుడుచుకున్నాడు. అప్పట్లో ఈ టిష్యూ పేపర్‌కు కోట్లు ఖరీదు ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ, ఇప్పుడు ఆ కన్నీళ్లు తుడిచిన టిష్యూ పేపర్ చాలా విలువైనదిగా మారింది. దాని ధర ఎంతో తెలిస్తే మీ గుండె అదిరిపోవడం ఖాయం.

రూ. 8 కోట్లు పలికిన టిష్యూ పేపర్..

మీడిమా సమావేశంలో మెస్సీ ఏడుస్తూ కన్నీటిని తుడుచుకున్న టిష్యూ పేపర్‌ను ఓ అభిమాని సేకరించాడు. దానిని భద్రంగా దాచాడు. అయితే, ఆ టిష్యూ పేపర్‌ను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టాడు. ఇప్పుడు ఆ టిష్యూ ధర ఏకంగా ఒక మిలియన్ డాలర్లు పలికింది. అంటే భారత కరెన్సీ ప్రకారం అది అక్షరాలా 8 కోట్ల రూపాయలు. మెస్సీ వాడి పడేసిన టిష్యూకి అంత ధర రావడంతో యావత్ ప్రపంచం ముక్కున వేలేసుకుంటోంది.

మరిన్ని స్పోర్ట్స్ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..