Virat Kohli Paternity Leave: తన సతీమణి, నటి అనుష్క శర్మ జనవరిలో బిడ్డకు జన్మనివ్వనుండటంతో విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్ తీసుకున్న విషయం తెలిసిందే. కోహ్లీ అభ్యర్థనకు బీసీసీఐ కూడా ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో వచ్చే నెల 17-21 మధ్య జరగనున్న తొలి టెస్ట్‌కు మాత్రమే కోహ్లీ అందుబాటులో ఉండనున్నారు. ఆ తరువాత భారత్‌కి తిరిగి రానున్నారు. (‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’గా రష్మిక మందన్న.. స్పందించిన కన్నడ బ్యూటీ)
అయితే కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయంపై కొందరు విమర్శలు కురిపించారు. మరికొందరు కోహ్లీ లేకపోతే టీమిండియాకి ఎదురయ్యే నష్టాలను అంచనా వేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో కొందరు కోహ్లీకి తమ మద్దతను తెలుపుతున్నారు. మొన్నటికి మొన్న భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్.. కోహ్లీ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని సూచించారు. ఇక తాజాగా టీమిండియా కోచ్ రవిశాస్త్రి కూడా కోహ్లీకి మద్దతు ఇచ్చారు. (లెక్కల మాస్టార్‌కి కట్టలుతెంచుకున్న కోపం.. ‘పుష్ప’ టీమ్‌కి వార్నింగ్..!)
కోహ్లీ తీసుకున్న నిర్ణయం సరైనదే. ఇలాంటి క్షణాలు మళ్లీ మళ్లీ రావు. అతడికి ఆ అవకాశం వచ్చింది. అందుకే వెనక్కి వెళుతున్నాడు. అందుకు అతడు చాలా సంతోషంగా ఉంటాడని భావిస్తున్నా. కానీ ఆస్ట్రేలియా టూర్‌లో మాత్రం అతడిని బాగా మిస్ అవుతాము అని రవిశాస్త్రి చెప్పుకొచ్చారు. (నేను కలిసిన కొత్తలో గౌతమ్ ఎలా ఉండేవాడంటే.. భర్త గురించి మరిన్ని విషయాలు చెప్పిన కాజల్)