తొమ్మిది వేళ్లే ఉన్నాయి.. పదో వేలు ఎలా పోయిందో చెప్పిన భారత క్రికెటర్..!

| Edited By:

Apr 28, 2020 | 6:13 PM

తనకు తొమ్మిది వేళ్లే ఉన్నాయని భారత వికెట్ కీపర్ పార్ధివ్ పటేల్ తెలిపారు. చిన్నప్పుడే తలుపు సందులో పడి చిటికెన వేలు విరిగిపోయిందని ఆయన అన్నారు.

తొమ్మిది వేళ్లే ఉన్నాయి.. పదో వేలు ఎలా పోయిందో చెప్పిన భారత క్రికెటర్..!
Follow us on

తనకు తొమ్మిది వేళ్లే ఉన్నాయని భారత వికెట్ కీపర్ పార్ధివ్ పటేల్ తెలిపారు. చిన్నప్పుడే తలుపు సందులో పడి చిటికెన వేలు విరిగిపోయిందని ఆయన అన్నారు. ఆరేళ్ల వయస్సున్నప్పుడు ఇంటి వద్ద ఆడుకుంటున్న సమయంలో తలుపు సందులో ఇరుక్కొని చిటికెన వేలు విరిగిపోయింది. దీని వలన పెద్దయ్యాక క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న తరువాత తొలినాళ్లలో పలు ఇబ్బందులు ఎదుర్కొన్నా. ముఖ్యంగా గ్లైజ్‌లో పది వేళ్ల అమరిక ఉన్న సమయంలో కాస్త ఇబ్బందిగా తోచేది. ఆ తరువాత అలవాటు అయిపోయింది. తొమ్మిది వేళ్లతోనే టీమిండియాను ఆడటం ఆనందించాల్సిన విషయం అని పార్ధివ్ చెప్పుకొచ్చారు. కాగా చిన్న వయస్సులోనే టీమిండియా తరఫున బరిలోకి దిగిన పార్ధివ్.. 25 వన్డేలు, 38 టెస్టులు ఆడారు. 2018-19 ఆస్ట్రేలియాపై చారిత్రక టెస్ట్ సిరీస్ గెలిచిన జట్టులోనూ పార్ధివ్ ఆడారు. కాగా న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్టిల్‌ ఒక కాలికి కేవలం రెండు వేళ్లు మాత్రమే ఉన్నాయి. ఓ ప్రమాదంలో ఆయన కాలికి మూడు వేళ్లు తెగిపోయాయి.

Read This Story Also: కరోనా వేళ.. చిన్నపిల్లల్లో కొత్త లక్షణాలు.. వైద్యుల్లో టెన్షన్‌..!