కరోనా వేళ.. చిన్నపిల్లల్లో కొత్త లక్షణాలు.. వైద్యుల్లో టెన్షన్‌..!

కరోనా విజృంభణతో ఇప్పటికే ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. మరోవైపు ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు పలు దేశాల శాస్త్రవేత్తలు ప్రయోగాలను ముమ్మరం చేశారు.

కరోనా వేళ.. చిన్నపిల్లల్లో కొత్త లక్షణాలు.. వైద్యుల్లో టెన్షన్‌..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 28, 2020 | 5:44 PM

కరోనా విజృంభణతో ఇప్పటికే ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. మరోవైపు ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు పలు దేశాల శాస్త్రవేత్తలు ప్రయోగాలను ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే కరోనా వేళ బ్రిటన్‌ను మరో కొత్త సమస్య కలవరపెడుతోంది. ఆ దేశంలో చిన్నారులను అంతుపట్టని అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. గడిచిన మూడు రోజుల్లో విపరీతమైన కడుపుమంట, గుండె సంబంధిత వ్యాధులతో బాధుపడుతోన్న వందలాది మంది చిన్నారులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. కరోనా వైరస్ బారిన పడిన బాధితుల్లో కూడా ఈ లక్షణాలు ఉండటం ఇప్పుడు అక్కడ కలకలం రేపుతోంది.

చిన్నారుల్లో టాక్సిక్‌ షాక్‌ సిండ్రోమ్ లక్షణాలు కనిపిస్తున్నాయని అక్కడి వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. పిల్లలు అనారోగ్యానికి గురైతే వెంటనే సమీప ఆసుపత్రుల్లో చేర్పించాలని తెలిపింది. అనుమానితులను వెంటనే గుర్తించి ఐసీయూల్లో ఉంచి చికిత్స అందించాలని ప్రభుత్వ ఆరోగ్య విభాగాన్ని ఆదేశించింది. కాగా బ్రిటన్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,69,569కు చేరుకుంది. ఆ దేశంలో 24వేల మంది కరోనా సోకి మృత్యువాతపడ్డారు.

Read This Story Also: నా జీవితంలో ఈ రోజుకెంతో ప్రత్యేకం.. ఎలాగంటే : రాఘవేంద్ర రావు