జైపూర్​లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం

|

Jul 05, 2020 | 4:48 PM

క్రికెట్ ప్రేమికుల శుభవార్త. ఇండియాలో మరో అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణానికి రంగం సిద్ధమైంది. 75 వేల మంది ఏకకాలంలో క్రికెట్ అస్వాదించేలా సువిశాల మైదానికి శ్రీకారం పడనుంది. ఇందుకు సంబంధించి రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం నిర్మాణానికి ప్లాన్ చేసింది.

జైపూర్​లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం
Follow us on

క్రికెట్ ప్రేమికుల శుభవార్త. ఇండియాలో మరో అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణానికి రంగం సిద్ధమైంది. 75 వేల మంది ఏకకాలంలో క్రికెట్ అస్వాదించేలా సువిశాల మైదానికి శ్రీకారం పడనుంది. ఇందుకు సంబంధించి రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం నిర్మాణానికి ప్లాన్ చేసింది. ఇందు కోసం రూ.550 కోట్లు వెచ్చించాలని నిర్ణయిచింది. ఈ నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే మూడో అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా నిలవనుంది.

రాజస్తాన్ రాష్ట్ర రాజధాని జైపూర్​కు 25 కిలోమీటర్ల దూరంలో ఢిల్లీ హైవేపై భారీ స్టేడియానికి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయి. 100 ఎకరాల సువిశాల స్థలంలో ఈ స్టేడియంను నిర్మిస్తున్నామని ఆర్​సీఏ సెక్రటరీ మహేంద్ర శర్మ ప్రకటించారు. మరో నాలుగు నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించి, రెండేళ్లలో స్టేడియంను అందుబాటులోకి తెస్తామని ఆయన చెప్పారు. స్టేడియం నిర్మాణంలో అన్ని ప్రమాణాలు పాటిస్తున్నామని.. క్రికెట్ ఫెసిలిటీస్​తోపాటు ఇండోర్​ గేమ్స్​, ట్రెయినింగ్ అకాడమీలు, క్లబ్ హౌస్​, 4000 వాహనాలు సరిపడే పార్కింగ్ లాట్ వంటి సదుపాయాలు ఇందులో ఉంటాయన్నారు. ఇండియాలోని మొతెరా స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్దది కాగా, మెల్బోర్న్ ​క్రికెట్ గ్రౌండ్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ జైపూర్ స్టేడియం పూర్తైతే ప్రపంచంలో అతి పెద్ద వాటిలో మూడో స్థానం సొంతం చేసుకుంటుంది.