Kolkata Knight Riders vs Punjab Kings: రస్సెల్ దెబ్బ.. పంజాబ్ అబ్బా.. కోల్‌కతా అదిరిపోయే విక్టరీ.. !

|

Apr 01, 2022 | 11:12 PM

Kolkata Knight Riders vs Punjab Kings: ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా టీమ్ ఘన విజయం సాధించింది.

Kolkata Knight Riders vs Punjab Kings: రస్సెల్ దెబ్బ.. పంజాబ్ అబ్బా.. కోల్‌కతా అదిరిపోయే విక్టరీ.. !
Kolkata Vs Punjab
Follow us on

Kolkata Knight Riders vs Punjab Kings: ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా టీమ్ ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ నమోదు చేసింది. రస్సెల్ రెచ్చిపోయి ఆడటంతో 33 బంతులు ఉండగానే మ్యాచ్ ముగిసింది. కేవలం 31 బంతులు ఆడిన రస్సెల్ 8 సిక్సర్లు, 2 ఫోర్లతో చెలరేగిపోయి 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ కూడా అద్భుతంగా రాణించాడు. 15 బంతుల్లో 5 ఫోర్లు బాది 26 పరుగులు చేశాడు. సామ్ బిల్లింగ్స్ కూడా సేమ్ టు సేమ్. 23 బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్‌తో 24 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అజింక్య రహానె 12 పరుగులు చేశాడు.

కాగా, వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ బ్యాట్స్‌మెన్.. తొలి నుంచే తడపాటుకు గురై వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. పంజాబ్ టీమ్‌లో రాజపక్స మాత్రమే రాణించాడు. 9 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో విధ్వంసకర బ్యాటింగ్‌ చేసి 31 పరుగులు చేశాడు. రబడ 16 బంతుల్లో 25 పరుగులు చేశాడు. లవింగ్‌స్టోన్(19), ధావన్ (16) కొట్టారు. మొత్తంగా 18 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయిన పంజాబ్ టీమ్.. 137 పరుగులు చేసి 138 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా ముందు ఉంచింది.

138 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌ స్టార్టింగ్‌ నుంచే దుమ్మురేపారు. వెంకటేష్ అయ్యర్, నితిష్ రానా తప్ప.. మిగిలిన ఐదుగురు ప్లేయర్స్ నెక్ట్స్ లేవల్ గేమ్ చూపించారు. ఇర రస్సెల్ అయితే చెప్పనక్కర్లేదు. విధ్వంసకర బ్యాటింగ్‌తో తుఫాను సృష్టించాడు. 8 సిక్సర్లు, 2 ఫోర్లతో చెలరేగిపోయాడు. పంజాబ్ బౌలర్లను బాబోయ్ అనిపించేలా చేశాడు. కేవలం 31 బంతుల్లో 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 14.3 ఓవర్లకే నిర్దేశిత లక్ష్యాన్ని చేరి టీమ్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. కోల్‌కతా గెలుపులో శ్రేయాస్ అయ్యర్(26), సామ్ బిల్లింగ్స్(24), అజింక్య రహానె(12) కృషి కూడా సూపర్ అని చెప్పాలి.

ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లు కూడా విధ్వంసం సృష్టించారు. తమ దూకుడు బౌలింగ్‌తో పంజాబ్ బ్యాట్స్‌మెన్‌ను ఆగమాగం చేసి.. వరుసగా వికెట్లు తీసుకున్నారు. ఉమేష్ 4, సౌతీ 2, శివమ్ మావి, నరైన్, రస్సెల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

Also read:

April Fool’s Day: ఏప్రిల్‌లో ‘‘ఫూల్స్ డే’’ని ఎందుకు జరుపుకుంటాం.. దీని వెనుక ఉన్న అసలు కథ ఇదే..!

Hair Care Tips: అందమైన కురులు కావాలంటే రివర్స్ హెయిర్ వాష్ ట్రై చేయండి.. పూర్తి వివరాలివే..

Hyderabad: అతనికి ‘కల’ వచ్చిందంటే ఖతమే.. ఫుట్‌పాత్‌పై ఉంటూ కోట్లు కూడబెట్టిన దొంగ..!