Praneeth Out of Thailand Open: థాయిలాండ్ ఓపెన్ నుంచి సాయి ప్రణీత్ ఔట్.. కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ

|

Jan 20, 2021 | 1:20 PM

కోవిడ్ కారణంగా అంతర్జాతీయ క్యాలెండర్ 9 నెలల సుదీర్ఘ విరామం తర్వాత థాయిలాండ్ ఓపెన్ ప్రారంభమైంది. ఈ పోటీ నిమిత్తం వెళ్లిన భారత్ షట్లర్లు తీవ్ర ఇబ్బందులు

Praneeth Out of Thailand Open: థాయిలాండ్ ఓపెన్ నుంచి సాయి ప్రణీత్ ఔట్.. కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ
Follow us on

Praneeth Out of Thailand Open: కోవిడ్ కారణంగా అంతర్జాతీయ క్యాలెండర్ 9 నెలల సుదీర్ఘ విరామం తర్వాత థాయిలాండ్ ఓపెన్ ప్రారంభమైంది. ఈ పోటీ నిమిత్తం వెళ్లిన భారత్ షట్లర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నల్టు తెలుస్తోంది. తాజాగా భారత్ షట్లర్ బి. సాయి ప్రణీత్ థాయిలాండ్ ఓపెన్ నుంచి తప్పుకున్నారు. ప్రణీత్ కు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. దీంతో అతను  10 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకోనున్నారని బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ తెలిపింది. కోవిడ్ సోకడం తో సాయి ప్రణీత్ టయోటా థాయిలాండ్ ఓపెన్ నుంచి వైదొలిగినట్లు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అధికారికంగా ప్రకటించింది.

మరోవైపు థాయ్‌లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్‌ శుభారంభం చేసినా పోటీ నుంచి వైదొలిగారు. సాయి ప్రణీత్ ఉన్న హోటల్ లో కిడాంబి శ్రీకాంత్ తో కలిసి ఉన్నాడని బ్యాడ్మింటన్ సమాఖ్య తెలిపింది. దీంతో కొవిడ్ ప్రొటోకాల్ ప్రకారం కిడాంబి శ్రీకాంత్ థాయ్ లాండ్ ఒపెన్ పోటీ నుంచి వైదొలిగి… స్వీయ నిర్బంధంలో ఉన్నారని క్రీడాపాలకమండలి తెలిపింది.శ్రీకాంత్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ గా రిజల్ట్ వచ్చింది. అయినా ముందస్తు చర్యలుగా క్వారంటైన్ చేశారు.

Also Read: నూతన అమెరికా అధ్యక్షుడిపై ఒడిశా చిత్రకారుడి అభిమానం, సీసాలో జో చిత్రం