IND vs ENG 2nd Test: నాలుగు మార్పులతో బరిలోకి ఇంగ్లాండ్.. 12 మంది జట్టు సభ్యులను ప్రకటించిన జో రూట్..

India vs England 2nd Test: భారత్‌పై జరిగిన మొదటి టెస్టులోనే భారీ విజయం సాధించి మంచి ఫాంలో ఉంది ఇంగ్లాండ్ జట్టు. ఈ క్రమంలోనే శనివారం నుంచి చెన్నైలోని..

IND vs ENG 2nd Test: నాలుగు మార్పులతో బరిలోకి ఇంగ్లాండ్.. 12 మంది జట్టు సభ్యులను ప్రకటించిన జో రూట్..

Updated on: Feb 12, 2021 | 5:12 PM

India vs England 2nd Test: భారత్‌పై జరిగిన మొదటి టెస్టులోనే భారీ విజయం సాధించి మంచి ఫాంలో ఉంది ఇంగ్లాండ్ జట్టు. ఈ క్రమంలోనే శనివారం నుంచి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్‌తో జరిగే రెండో టెస్టుకు 12 మంది సభ్యుల జట్టును ఇంగ్లాండ్‌ శుక్రవారం ప్రకటించింది. శనివారం నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టుకు తుది జట్టులో ఏకంగా నాలుగు మార్పులు చేసినట్లు ఇంగ్లాండ్ సారధి జో రూట్ తెలిపాడు. సీనియర్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌, జోస్‌ బట్లర్‌, డామ్‌ బెస్‌లకు శనివారం నుంచి జరిగే టెస్టుకు విశ్రాంతి నిచ్చారు. స్టార్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ మోచేతి గాయంతో మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని ఈసీబీ అంతకుముందు పేర్కొన్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో కొంతమంది కీలక ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు. దీంతో మొయిన్‌ అలీ, స్టువర్ట్‌ బ్రాడ్‌, క్రిస్‌ వోక్స్‌, బెన్‌ ఫోక్స్‌, ఒలీ స్టోన్‌లకు తుది జట్టులోకి తీసుకున్నారు. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్‌ మొదటి టెస్టులో గెలిచి1-0తో ఆధిక్యంలో ఉంది.

ఇంగ్లాండ్‌ టీమ్‌:
జో రూట్‌ (కెప్టెన్), రోరీ బర్న్స్‌, డామ్‌ సిబ్లే, డేనియల్‌ లారెన్స్‌, బెన్‌ స్టోక్స్‌, ఓలీ పోప్‌, మొయిన్‌ అలీ, జాక్‌ లీచ్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, క్రిస్‌ వోక్స్‌, బెన్‌ ఫోక్స్‌, ఒలీ స్టోన్‌

Also Read:

Sreesanth reacts : నా వయసు 38.. ఇప్పుడు కాకుంటే వచ్చే ఏడాది.. ఐపీఎల్ వేలంపై శ్రీశాంత్ రియాక్షన్

India Vs England 2021: రెండో టెస్టుకు ముందు టీమిండియాలో భారీ మార్పులు.. ఆ ఇద్దరిపై వేటు తప్పదా.!